ఎన్టీఆర్ జిల్లా నందిగామలో క్షుద్రపూజల కలకలం రేపింది. చందర్లపాడు మండలం గుడిమెట్ల వజ్రాలగుట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మేకలను బలిచ్చి క్షుద్ర పూజలు చేశారు. వ్యాపార అభివృద్ధి జరగాలని పేపర్‌పై రాసి క్షుద్ర పూజలు చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుత ఆధునిక కాలంలో మానవుడు భూమి నుంచి ఆకాశానికి చేరుకునేంత టెక్నాలజీని కనుగొన్నాడు. కానీ కొందరు మాత్రం మూఢ నమ్మకాల పేరుతో చంపుకు చస్తున్నారు. చేతబడి, క్షుద్రపూజలు వంటి మూఢ నమ్మకాలతో బతుకుతున్నారు. వ్యాపారం బాగా జరగాలని జంతువులను బలిస్తున్నారు. అయితే ఇలాంటి వాటిపై పోలీసులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా కనీసం చైతన్యం రావడం లేదు.

బలిచ్చి క్షుద్ర పూజలు
తాజాగా అలాంటిదే ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన సంఘటన జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. చందర్లపాడు మండలం గుడిమెట్ల వజ్రాలగుట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మేకలను బలిచ్చి క్షుద్ర పూజలు చేశారు. వ్యాపార అభివృద్ధి జరగాలని పేపర్‌పై రాసి క్షుద్ర పూజలు చేయడంతో అంతా షాక్ అవుతున్నారు.

అదే సమయంలో నాగరాజు అనే వ్యక్తి తన 3 మేకలు కనిపించపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగానే మేకల కోసం వెతుకుతుండగా తన మేకలే బలిచ్చినట్లు నాగరాజు గుర్తించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్షుద్ర పూజలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉంటే మరోవైపు నందిగామ నుంచి 15 కి.మీ దూరంలో గుడిమెట్ల గ్రామానికి సమీప ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి. దీంతో ఎన్నో దశాబ్దాలుగా ఆ సమీప ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగుతుంది. దాదాపు రెండు రాష్ట్రాల నుంచి ఇక్కడకి వజ్రాల వేటకు వేలాది జనం వస్తుంటారు. ఇప్పుడు అదే ప్రాంతంలో గుడిమెట్ల వజ్రాలగుట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మేకలను బలిచ్చి క్షుద్ర పూజలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Also read
- నేటి జాతకములు.29 ఏప్రిల్, 2026
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.





