దీపావళి పండుగ పూట అపశృతి జరిగింది. ఏలూరులో బాణసంచా పేలి ఒకరి మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. ఉల్లిపాయ బాంబు బస్తా పేలి సుధాకర్ అనే వ్యక్తి మృతిచెందగా, 6 గురికి తీవ్ర గాయాలైయ్యాయి.
దీపావళి పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ ఏలూరులో అపశృతి చోటుచేసుకుంది. ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్ద ఉల్లిపాయ బాంబు బస్తా పేలి సుధాకర్ అనే వ్యక్తి మృతిచెందగా, 6 గురికి తీవ్ర గాయాలైయ్యాయి. గాయపడిన వారిలో తాబేలు సాయి, సువార శశి, కే. శ్రీనివాసరావు, ఎస్కే ఖాదర్, సురేష్, సతీష్‌లు ఉన్నారు.హోండా యాక్టివా వాహనంపై ఉల్లిపాయ బాంబు బస్తా తీసుకువెళుతుండగా గోతిలో బండి పడటంతో ఒక్కసారిగా ఉల్లిపాయ బాంబులు పైకి లేచి తిరిగి బస్తాలో పడటంతో పేలుడు సంభవించింది. దీంతో వాహనం వెనుక కూర్చొని ఉన్న వ్యక్తి శరీరభాగాలు పేలుడు ధాటికి తెగిపడిపోయాయి. సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, వన్ టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ మదీనా బాషా సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేలుడు సంఘటనతో ఒక్కసారిగా తూర్పు వీధి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also read
- లేడీ కాదు.. మహా కిలాడీ.. వైద్యురాలిగా నటిస్తూ!
- సాహితీవేత్తా దుర్గాప్రసాద్ ఉగాది పురస్కారం ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- పరాభావ నామసంత్సరం అంటే అన్నీ పరాభావాలేనా? పండితులు ఏమంటున్నారంటే?
- Watch Video: ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. సైరన్ మోగడంతో పరార్! ఎక్కడంటే..
- ఆరుగురు మహిళలు.. ధూమ్ సినిమా రేంజ్లో ప్లాన్.. చివరకు జరిగిందిదే..





