జన్వాడ పార్టీ కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ మద్దూరి పోలీసులకు వేరే మహిళ ఫోనును అందించడం కలకలం రేపుతోంది. హైకోర్టు రాజ్ పాకాలకు 48 గంటల గడువు ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
జన్వాడ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.. ఇప్పటికే.. పోలీసులు కేసు నమోదు చేసి.. కీలక ఆధారాలు రాబట్టేందుకు విచారణ వేగవంతం చేశారు. అయితే.. జన్వాడ పార్టీ కేసులో సోమవారం హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్పై విచారణ జరిగింది. పక్కా ఆధారాలు, స్టేట్మెంట్స్ ఉన్నాయని కోర్టును విన్నవించారు అడిషనల్ అడ్వకేట్ జనరల్. దాని ఆధారంగానే ముందుకెళ్తామన్నారు. అయితే ఇది రాజకీయ వేధింపులని.. ఇంట్లో జరుగుతున్న పార్టీపై రెయిడ్స్ నిర్వహించి.. కక్షసాధిస్తున్నారంటూ రాజ్ పాకాల లాయర్ వాదించారు. అటు పోలీసులు నమోదు చేసిన FIRపై అనుమానాలున్నాయని.. తగినంత సమయం ఇవ్వకుండానే విచారణకు పిలుస్తున్నారంటూ కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు రాజ్ పాకాలకు 48 గంటల సమయం ఇచ్చింది. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని పోలీసులను ఆదేశించింది. రాజ్ పాకాలకు హైకోర్టు 48 గంటల సమయం ఇవ్వగా.. ఆధారాల మేరకు చర్యలుంటాయని AAG కోర్టుకు తెలిపింది..
ఇదిలాఉంటే.. జన్వాడ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. జన్వాడ నైట్ పార్టీ కేసులో ఆ రాత్రి ఏం జరిగిందనే విషయంలో విచారణ చేపట్టనున్నారు. అయితే రెయిడ్స్ జరిగిన రోజు విజయ్ మద్దూరి తన ఫోన్ కాకుండా.. పార్టీకి వచ్చిన వేరే మహిళ ఫోన్ను పోలీసులకు ఇచ్చారు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించారు. తన ఫోన్ తనకు ఇవ్వాలని మోకిల పోలీసులను కోరుతున్నారు. దీంతో ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు పోలీసులు. కాగా.. నిన్నటి నుంచి విజయ్ మద్దూరి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది.. దీనిపై కూడా పోలీసులు విచారణ చేపట్టనున్నారు.
అయితే.. జన్వాడ పార్టీ కేసులో నిన్న విచారణకు గైర్హాజరైన విజయ్ మద్దూరి, రాజ్ పాకాల.. 48 గంటల గడవు తర్వాత పోలీసులకు ఏం సమాధానం చెబుతారనేది కీలకంగా మారింది
Also read
- హిజ్రాలు కాదు.. మగవాళ్లే! బీఎండబ్ల్యూ కారు ఆపి మరీ..
- విదేశీ యువతులతో వల.. హైదరాబాద్లో హైటెక్ దందా..! కథ మామూలుగా లేదుగా..
- నర్సింగ్ విద్యార్థిని హత్య కేసులో సంచలన ట్విస్ట్.. చంపిందెవరో తెలిసి షాక్!
- పగలు తండ్రి దగ్గర.. రాత్రి తల్లి దగ్గర.. చివరకు నీటి కుంటలో శవమై కనిపించిన ప్రభు కిరణ్..
- రూ.20 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు.. అయినా ఆశ తీరలేదు.. అయ్యో కవిత..





