కృష్ణరాజపురం: సిలికాన్ సిటీలో నిత్యం ఎక్కడో ఒకచోట ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. రోడ్డుపై యువతితో అసభ్యంగా ప్రవర్తించి చెప్పుతో దాడి చేశాడో కిరాతకుడు. ఈ దురాగతం బెంగళూరులోని సుబ్రమణ్యపుర పుర పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ యువతి రోడ్డు మీద వెళ్తుండగా అతడు అడ్డుకుని వాగ్వాదానికి దిగాడు.
ఆమె బట్టలు చించివేసి ఆపై చెప్పుతో దాడి చేశాడు. ఈ దాడితో బాధితురాలు విలవిలలాడింది. కొందరు వీడియోలు తీయడంతో వైరల్ అయ్యాయి. అతడు తరచూ మహిళలకు మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ వీడియో తీసి కేబీ హరీష్ అనే వ్యక్తి బెంగళూరు ఎక్స్లో పోలీసులకు ట్యాగ్ చేశాడు. అతనిపై సత్వరం చర్యలు చేపట్టాలని కోరగా, చర్యలు చేపడతామని సంబంధిత పోలీసులు బదులిచ్చారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




