మద్యానికి బానిసైన భర్త, భార్య మీద కోపాన్ని కూతురుపై చూపించాడు. ఇంటి రాగానే కన్నకూతురును దెబ్బలు కొడుతూ, ఎవరికైనా అమ్మేస్తాననీ బెదిరించాడు.
సాధారణంగా పిల్లలకు నాన్నే రోల్ మోడల్. ముఖ్యంగా ఆడ పిల్లలకు అమ్మతో కంటే నాన్ననే ఎక్కువగా అనుబంధం ఉంటుంది. వారికి తండ్రే తొలి హీరో అతనితోనే వారికి ఎక్కువగా సాన్నిహిత్యం ఉంటుంది. కానీ ఈ బాలిక మాత్రం తండ్రి పేరు చెబితేనే.. వణికిపోతోంది. ఇంటికి వెళ్ళేదీ లేదంటూ మారాం చేస్తోంది. ఆ బాలికకు ఏమైంది..? తండ్రిని చూసి ఎందుకు భయపడుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
హైదరాబాద్ పాతబస్తీ బాబానగర్‌కు చెందిన అక్బర్ దంపతులు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని బంగారుగడ్డలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త, కూతురుని వదిలి తన కుమారుడితో కలిసి తల్లి గారింటికి వెళ్ళిపోయింది భార్య. కూతురు స్థానిక ప్రాధమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. మద్యానికి బానిసైన అక్బర్ భార్య మీద కోపాన్ని కూతురుపై చూపిస్తున్నాడు. ఇంటి రాగానే దెబ్బలు కొడుతూ, ఎవరికైనా అమ్మేస్తాననీ బెదిరించాడు.
తండ్రి భయంతో స్కూల్ వచ్చిన బాలిక తోటి విద్యార్థులతో విషయం చెప్పింది. ఇంతలోనే మద్యం మత్తులో ఉన్న అక్బర్ కూతురుని తీసుకువెళ్లడానికి స్కూలుకు వచ్చాడు. తాను తండ్రితో వెళ్ళనని.. తనను అమ్మేస్తానని బెదిరిస్తున్నాడని భయంతో వణికిపోయింది. అయితే, తన కూతురిని తనతో పంపించాలని ఉపాధ్యాయులతో గొడవకు దిగాడు. విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు అమ్మాయిని చైల్డ్ వెల్ఫేర్ కు అప్పగించారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





