పలాస జిల్లాలో మద్యం మత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ముగ్గురు బాలికలను బర్త్డే పార్టీకి తీసుకెళ్లి యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కూతుర్ల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
AP News: పలాసలో అమానుషం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడిన ఘటన పలాస జిల్లాలో కలకలం రేపింది. 19వ తేదీన పలాస సూదికొండకు చెందిన ముగ్గురు మైనర్ బాలికలను బర్త్డే పార్టీకి ముగ్గురు యువకులు తీసుకువెళ్లారు. అనంతరం ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి ఇద్దరు యువకులు పాల్పడ్డారు. మూడో మైనర్ బాలిక ప్రతిఘటించడంతో మూడో వ్యక్తి ఆ ఇద్దరి అత్యాచారాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు.
ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు..
ఈ ఘాతుకంలో ఇద్దరు అక్కాచెల్లెల్లు బలైయ్యారు. తల్లిదండ్రులు కూతుర్ల భవిష్యత్తు కోసం ఈ దారుణాన్ని దాచి పెట్టారు. చిన్న కుమార్తెకు ఆరోగ్యం బాగోక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మద్దతుగా నిలిచారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.
గత ప్రభుత్వం హయాంలో పలాస ప్రతిష్టకు భంగం కలిగిందన మండిపడ్డారు. ఆ సంస్కృతికి చెరమగీతం పాడాలన్నారు. మరోసారి ఆడపిల్ల వైపు చూడాలన్నా, వారిపై దాడులకు పాల్పడాలన్నా భయపడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ముగ్గురు నిందితులను వదిలేది లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




