ప్రేమతో వారిద్దరి మనసులు కలిశాయి.. పెళ్లితో ఒక్కటయ్యారు.. జీవితాంతం ఒకరికొకరు తోడుండాలని భావించారు.. కానీ వీరి అన్యోన్యతను చూడలేకపోయిందేమో విధి.. హాయిగా సాగిపోతున్న దంపతుల బంధాన్ని చిదిమేసింది…
ప్రేమతో వారిద్దరి మనసులు కలిశాయి.. పెళ్లితో ఒక్కటయ్యారు.. జీవితాంతం ఒకరికొకరు తోడుండాలని భావించారు.. కానీ వీరి అన్యోన్యతను చూడలేకపోయిందేమో విధి.. హాయిగా సాగిపోతున్న దంపతుల బంధాన్ని చిదిమేసింది.. రోడ్డు ప్రమాద రూపంలో భర్తను విడదీసింది.. చేదువార్త విన్న ఆమె గుండె పగిలింది.. భర్తలేని లోకంలో నేనుండలేనంటూ తానూ వెళ్లిపోయింది.. ఈ హృదయ విదారక ఘటన లావేరు మండలంలో చోటుచేసుకుంది..
లావేరు మండలం కేశవరాయనపాలెం గ్రామానికి చెందిన నాయిని చంటి ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీ నందిగాంకు చెందిన భవానీ ప్రేమించుకొని ఏడాదిన్నర కిందట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చంటి దసరా రోజున ఉదయం అల్పాహారం తీసుకొచ్చేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మురపాక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే.. భర్త మరణవార్త విన్న భవానీ ఆదివారం ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స కోసం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందింది. ఈ ఘటనతో కేశవరాయనపాలెం గ్రామం విషాదంలో మునిగిపోయింది. భవాని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. లావేరు పోలీసులు ఈ ఘటనలపై వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




