November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

Crime News: ఎంబీఏ చేశాడు.. చోరీల్లో సెంచరీ  దాటాడు



ప్రముఖ కళాశాలలో పీజీ పూర్తి చేశాడు. విలాసవంతమైన జీవితం కోసం దొంగగా మారాడు. బండి నంబరు ప్లేట్లు, ఒంటిపై చొక్కాలు మార్చి పోలీసులను ఏమార్చుతాడు.

హైదరాబాద్, , కార్ఖానా: ప్రముఖ కళాశాలలో పీజీ పూర్తి చేశాడు. విలాసవంతమైన జీవితం కోసం దొంగగా మారాడు. బండి నంబరు ప్లేట్లు, ఒంటిపై చొక్కాలు మార్చి పోలీసులను ఏమార్చుతాడు. రాజధానిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 100కు పైగా చోరీలకు పాల్పడిన మహ్మద్ అవేజ్ అహ్మద్ అలియాస్ అహ్మద్(42)ను అరెస్టు చేసి, రూ.10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తరమండలం డీసీపీ ఎస్. రష్మి పెరుమాళ్ శుక్రవారం తెలిపారు. మలక్పేట పరిధి సైదాబాద్ ఇంద్రప్రస్థ కాలనీకి చెందిన మహ్మద్ అవేజ్ అహ్మద్ ఎంబీఏ పూర్తిచేశాడు. తండ్రి వైద్యశాఖలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ పొందారు. అహ్మద్ కళాశాల వయసులోనే జల్సాలకు అలవాటు పడి.. వాటి కోసం చోరీల బాటపట్టాడు. మొదటి భార్యకు సంతానం కలగకపోవటంతో రెండో వివాహం చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. 2016లో ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఎన్నిసార్లు జైలుకెళ్లినా.. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా మారలేదు. సీసీ టీవీ కెమెరాలు, వేలిముద్రలు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటివరకు 114 దొంగతనాలకు పాల్పడ్డాడు. వివిధ పోలీస్ స్టేషన్లలో 107 కేసులు నమోదయ్యాయి. చోరీ చేసే ముందు బైక్పై రెక్కీ చేసి.. మధ్యాహ్నం మాత్రమే తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడతాడు. కొట్టేసిన వస్తువులను రిసీవర్ల చేతికిచ్చి హోటళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, బంధువుల ఇళ్లలోకి మకాం మార్చుతాడు. ఓ కేసులో అరెస్టై జైలుకెళ్లిన ఇతడు సెప్టెంబరు 5న విడుదలై బయటకు వచ్చాక మిత్రుడు సలామ్ బిన్తో కలిసి కొండాపూర్, టోలిచౌకి, లంగర్హౌస్, కార్ఖానా ప్రాంతాల్లో వరస చోరీలకు పాల్పడ్డాడు. ఈ నెల 7న కార్ఖానాలోని ఓ ఇంట్లో విలువైన వస్తువులు చోరీ చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ రామకృష్ణ బృందం సీసీ కెమెరా ఫుటేజ్తో నిందితుడిని గుర్తించారు. ద్విచక్రవాహనం అద్దెకు తీసుకొని.. నంబరు ప్లేటు మార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఎట్టకేలకు అహ్మద్ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Also read

Related posts

Share via