సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మంగళవారం రాత్రి ఓ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.
సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ శిశువును అపహరించిన ఘటన కలకలం రేపింది. మానూరు మండలం దూదిగొండకు చెందిన నసీమా అనే గర్భిణి నాలుగో కాన్పు కోసం గత రాత్రి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరింది. సిజేరియన్ ద్వారా మహి ఆడశిశువుకు జన్మినిచ్చింది. కొంతసేపటికే ఆ శిశువు కనిపించకుండా పోయింది. బాధిత మహిళ, ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ ప్రసవ సమయంలో ఆసుపత్రి ఆవరణలో ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా తిరగడం సీసీ కెమెరా ఫుటేజీలో నమోదైంది. వారే శిశువును ఎత్తుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- ఐ.యఫ్.టి.యు అధ్యక్ష, కార్యదర్శులు గా పామర్తి సత్య, గెడ్డం రవీంద్ర లు.
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వాస్తు టిప్స్ : ఇంటిలోకి పాము రావడం శుభమా? అశుభమా?
- Garuda Purana: అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం వాటి విశిష్టత ఇదే
- Guru Purnima: ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే!





