ఒంగోలు::
దేవీశరన్నవరాత్రులలో త్రిశక్తుల ఆరాధన ఙ్ఞానవైరాగాలను కలిగిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, ప్రకాశంజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు అన్నారు. కేశవస్వామిపేటలో లలితాశ్రమంలో జరుగుతున్న దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆయన త్రిశక్తుల వైభవంపై ప్రసంగించారు. మహాసరస్వతి వాక్కుని, మహాలక్ష్మి ఐశ్వర్యాన్ని , మహాదుర్గ శక్తిని ప్రసాదిస్తుందన్నారు. ఉపసన్యాసకులు పొన్నూరు వేంకట శ్రీనివాసులుని లలితాశ్రమం మాతాజీ విఙ్ఞానంద సరస్వతి అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో స్వయంపాకుల కోటేశ్వరశర్మ, అగస్త్యరాజు శివయ్య, నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వర శర్మ, ఒ.ప్రసాద్, గుర్రం కష్ణ, చిలకపాటి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





