బేస్తవారపేట, : ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ అక్రమ లాభార్జనే ధ్యేయంగా తోటి ఉపాధ్యాయులను, ప్రజలను మోసం చేసే మార్గాన్ని ఎంచుకున్నారు. నమ్మకంగా ఉండి చీటిపాటల నిర్వహణతో పాటు, అప్పులు తీసుకుని మోసం చేసి పరారైన సంఘటన బేస్తవారపేట మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు తెలియజేసిన వివరాల మేరకు… బేస్తవారపేటకు చెందిన ఐతా కిషోర్కుమార్ కొత్త మల్లాపురం ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా (స్కూల్ అసిస్టెంట్) పనిచేస్తున్నారు. చీటిపాటలు, ప్లాట్ల వ్యాపారం పేరిట ఉపాధ్యాయులను, వ్యాపారస్తులను మోసం చేశారు. గత కొంతకాలంగా మెడికల్ లీవ్ పెట్టి భార్య, పిల్ల ఏడాది క్రితం సహా పరారయ్యారు.. దీంతో బాధితులు గత ఎస్పీ మల్లికాగార్గ్కు స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ బేస్తవారపేట ఎస్సై నరసింహారావుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కిషోర్కుమార్పై చీటింగ్, చిట్ ఫండ్ కేసులు నమోదు చేసి అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆగస్టు 8న హైదరాబాద్లో ఉన్న ఐతా కిషోర్కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని బేస్తవారపేట పోలీస్ స్టేషన్కు తరలించి రిమాండ్ విధించారు. స్టేషన్లో పోలీసులు అతనిపై విచారణ చేపట్టగా దాదాపు రూ.6.70 కోట్ల మేర చీటి పాటలతో పాటు, పలువురి వద్ద అప్పు తీసుకుని మోసం చేసి పరారైనట్లు తెలిసింది. రిమాండ్ అనంతరం బెయిల్పై తిరిగి అతను హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈయన నాడు-నేడు పనుల్లో కూడా చేతివాటం చూపినట్లు ఆరోపణలున్నాయి
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025