కోపంతో రగిలిపోయిన పప్పు.. కుక్కను కర్రలతో విచక్షణారహితంగా కొట్టాడు. ఆపై వేడి నిప్పులు చల్లాడు. అక్కడితో ఆగకుండా గాయపడిన కుక్కను బైక్ వెనుక తాళ్లతో కట్టి వీధుల్లో తిప్పి చివరికి బండ రాయితో కొట్టి చంపాడు. ఈ షాకింగ్ ఘటన సీసీ టీవీలో రికార్డయింది.
తన కూతురిని ఓ వీధి కుక్క కరిచిందనే కోపంతో ఓ వ్యక్తి ఆ కుక్కను అతి దారుణంగా చంపేశాడు. ఓ కుక్క ఓ బాలికను కరవడంతో ఆమె తండ్రి కుక్కపై అత్యంత క్రూరంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పప్పు అనే వ్యక్తి కూతురిని ఓ వీధి కరించింది. దీంతో కోపంతో రగిలిపోయిన పప్పు.. కుక్కను కర్రలతో విచక్షణారహితంగా కొట్టాడు. ఆపై వేడి నిప్పులు చల్లాడు. అక్కడితో ఆగకుండా గాయపడిన కుక్కను బైక్ వెనుక తాళ్లతో కట్టి వీధుల్లో తిప్పి చివరికి బండ రాయితో కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్లోని గుణాలో జరిగిన ఈ షాకింగ్ ఘటన సీసీ టీవీలో రికార్డయింది.
జరిగిన దారుణంపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. పప్పు చేసిన దారుణానికి పోలీసులే షాక్ తిన్నారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. అతనిపై జంతు హింస కేసు నమోదు చేశారు.
విచారణ కొనసాగుతుండగా, స్థానిక జంతు హక్కుల కార్యకర్తలు నిరసనలను ప్లాన్ చేస్తున్నారు, కఠినమైన శిక్షలు మరియు జంతు క్రూరత్వం గురించి మరింత అవగాహన కోసం ఒత్తిడి చేస్తున్నారు
Also read
- తల, కాళ్లు చేతులు ఒక ఊరిలో.. మొండెం మరో ఊరిలో..
- కుమారుడి ప్రేమ వ్యవహారం.. మాట్లాడుకుందామని తండ్రిని పొలాల్లోకి తీసుకెళ్లి..
- Vijayawada: నీళ్ల బాటిల్ కోసం ఇంతటి దారుణమా? చేతులు వెనక్కి విరిచి స్తంభానికి కట్టేశారు.. చివరకు
- విహారంలో విషాదం.. సముద్ర తీరంలో కొట్టుకుపోయి ముగ్గురు యువతులు, యువకుడు మృతి!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?






మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..