నెల్లూరు/ఒంగోలు::
హాస్యం మానవ జీవితానికి టానిక్ లా పనిచేస్తుందని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. చేతన సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాలులో జరిగిన కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలో హాస్యం అన్న అంశంపై ప్రసంగించారు. సభకు కృష్ణాపట్నం ఎ.పి. జెన్‌కో డి.ఎస్.పి. కొల్లూరు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.
విశిష్ట అతిధులుగా పద్యకళా పరిషత్ అధ్యక్షులు మెట్టు రామచంద్ర ప్రసాద్, వర్ధమాన సమాజం కార్యదర్శి మజ్జిగ ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. భారతీయ భాషల్లో తెలుగు సాహిత్యంలో హాస్యం పండించిన రచయితలు అనేకం మంది ఉన్నారని పొన్నూరు వెంకట శ్రీనివాసులు తెలిపారు. తెలుగు సాహిత్యంలోని అనేక ప్రక్రియలలో హాస్య, వ్యంగ్య కవితలు, పద్యాలు వినిపించారు. హాస్యం వల్ల బిపిలు, షుగర్ లాంటివి మనదరిదాపులకు రావన్నారు. చేతన కార్యదర్శి వై.శేషగిరీశమ్, కార్యవర్గ సభ్యుడు, వీ.ఆర్. కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సుబ్రహ్మణ్యం నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో వక్త శ్రీనివాసులును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రపంచ తెలుగు సమాఖ్య రీజినల్ కోఆర్డినేటర్ నలుబోలు బలరామయ్య నాయుడు, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఎ. జయప్రకాష్, బాలభవన్ డైరెక్టర్ జి.సుభద్రాదేవి, కవి రాచపాలెం రఘు, వై.విశ్వనాధం, చేజర్ల వినయ, పి.వి.సుబ్రమణ్యం, బృందావనరావు, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..