తిరుమల లడ్డూ కల్తీపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి అన్నారు.
తిరుమల: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ పోలీసులు ఇవాళ(సోమవారం) అదుపులోకి తీసుకున్నారు. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని.. అతని వాహనంలోనే తిరుపతికి తరలించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… కొద్ది రోజులుగా తన మనస్సు తల్లడిల్లిపోతోందని.. తాను ఏ తప్పు చేయలేదని… ఏ పరీక్షకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి చెప్పారు.
తన హయాంలో ఏదైనా తప్పు చేసి ఉంటే.. తాను.. తన కుటుంబం నాశనం అయిపోతామని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు కరుణాకర్ రెడ్డి యత్నించారు. లడ్డూలు కలంకితమైందని.. కలుషిత రాజకీయ మనుషులు ఆరోపణలు చేశారని అన్నారు. ఈ సమయంలో కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also read
- హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
- ఆర్ధిక ఇబ్బందులా, జీవితంలో సమస్యలా హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఇలా పూజ చేయండి..
- హనుమంతుడికి ఇష్టమైన ఈ నైవేద్యం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి..!
- సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం
- Nellore: నెల్లూరు జిల్లాలో భర్త, అత్తమామల పైశాచికం.. కోడలిని వివస్త్రను చేసి హత్య!