November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Jatwani: ముంబయి నటి ఫిర్యాదు.. వైకాపా నేత కుక్కల విద్యాసాగర్పై కేసు



ముంబయి నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.



విజయవాడ: ముంబయి నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి, చిత్ర హింసలకు గురి చేశారని తల్లిదండ్రులు, న్యాయవాదులతో కలిసి ముంబయి నటి శుక్రవారం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో వైకాపా నేత కుక్కల విద్యాసాగర్, మరి కొందరు పై 192, 211, 218, 220, 354, 467, 420, 469, 471, రెడ్విత్ 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ముంబయి నటి శనివారం కూడా ఇబ్రహీంపట్నం పీఎస్కు వెళ్లి కేసుకు సంబంధించిన వివరాలు అందజేశారు.

జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఆమెను వేధించిన పోలీసులపై ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హనుమంతరావు జత్వానీ కేసు తర్వాత బదిలీల్లో భాగంగా కాకినాడ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆమె పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో మళ్లీ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమె ఇంటరాగేషన్లో కీలక పాత్ర వహించారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐ సత్యనారాయణ కేసు పూర్వపరాలు పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారంటూ కేసు నమోదు చేసి ఆగమేఘాలపై అరెస్టు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కర్త, క్రియగా వ్యవహరించిన ఐపీఎస్ లు
పి. సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. నేడో రేపో ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశముందని సమాచారం.

Also read

Related posts

Share via