November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshSpiritual

Andhra Pradesh: వారెవ్వా.. రూ.2.3 కోట్ల కరెన్సీ నోట్లతో బొజ్జ గణపయ్యకు అలంకరణ! ఎక్కడో తెలుసా



రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడి గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో… అత్యంత్య వైభవంగా ఇక్కడ చవితి వేడుకలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా గణనాధుడి ఎత్తు పెంచుతూ వచ్చిన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకొని క్రమంగా ఎత్తు తగ్గిస్తూ వస్తోంది. అయితే ఖైరతాబాద్ వినాయకుడిని ఆదర్శంగా తీసుకున్న ఏపీ వాసులు మాత్రం అలంకరణ కోసం..


మంగళగిరి, సెప్టెంబర్‌ 13: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడి గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో… అత్యంత్య వైభవంగా ఇక్కడ చవితి వేడుకలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా గణనాధుడి ఎత్తు పెంచుతూ వచ్చిన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకొని క్రమంగా ఎత్తు తగ్గిస్తూ వస్తోంది. అయితే ఖైరతాబాద్ వినాయకుడిని ఆదర్శంగా తీసుకున్న ఏపీ వాసులు మాత్రం అలంకరణ కోసం వినియోగించే కరెన్సీ నోట్లను పెంచుకుంటూ పోతున్నారు. ఈ ఏడాది ఏకంగా 2.3 కోట్ల రూపాయల నోట్లతో ప్రత్యేక అలంకరణ చేసి ఔరా అనుకునేలా చేశారు. ఎక్కడనుకుంటున్నారా…


ఖైరతాబాద్ వినాయకుడి తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కొలువుంటే… కరెన్సీ గణపతి ఏపీ రాజధాని సమీపంలో ఉన్న మంగళగిరిలో కొలువుదీరాడు. మంగళగిరిలోని మెయిన్ బజార్లో వ్యాపార వేత్త బాలాజీ గుప్తా ఆధ్వర్యంలో గత పద్దెనిమిదేళ్ళ నుండి గణపతి నవరాత్రులను నిర్వహిస్తున్నారు. మొదట ఇక్కడ గణపతిని ఆలంకరించడానికి కరెన్సీ నోట్లను ఉపయోగించడం బాలాజీ గుప్తాతోనే మొదలైంది. మొదట లక్ష రూపాయల కరెన్సీ నోట్లను వినాయకుడిని అలంకరించడానికి ఉపయోగించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా కరెన్సీ నోట్లను పెంచుకుంటూ పోతున్నారు

Also read

Related posts

Share via