స్కూల్ బస్సుల ప్రమాదాలు గురించి నిత్యం చూస్తూనే ఉంటాం. ఎక్కడో చోట ఏదో ఒక స్కూల్ బస్సు ప్రతిరోజు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్‌లో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి గుంతలోకి దూసుకువెళ్ళింది. ఆ సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు.
జమ్మలమడుగు ప్రాంతంలో గల గండికోట ఘాట్ రోడ్‌లో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. గండికోట రోడ్లు ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అదుపు తప్పడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా బస్సు రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకు వెళ్లడంతో అందులోని విద్యార్థులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు ఎవరికి ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అదే గనక బస్సు మరికొంత స్పీడ్‌గా ముందుకు కదిలి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది. అందులో ప్రయాణిస్తున్న 25 మంది విద్యార్థులు, డ్రైవర్ తో సహా అందరికీ ప్రాణహాని జరిగి ఉండేది. ఎప్పుడైతే బస్సు గుంతలోకి దూసుకువెళ్తుందో, వెంటనే స్పందించిన డ్రైవర్ కంట్రోల్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఏదేమైనా విద్యార్థులు ప్రయాణించే స్కూలు బస్సులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అప్రమత్తంగా డ్రైవర్లు వాటినే నడపాలి. కానీ ఆదమరిస్తే మాత్రం చాలా ప్రమాదం. అలానే ట్రాన్స్‌పోర్ట్ అధికారులు ఎప్పటికప్పుడు స్కూల్ బస్సులను చెక్ చేస్తూ వాటి కండిషన్ పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు
Also read
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..
- పిల్లలను కారులో ఉంచి లాక్ చేయడంతో…కొంచమైతే ఎంతఘోరం జరిగేది?
- పోలీసోళ్లను పిచ్చోళ్లను చేసింది.. MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ !
- తిరుపతి అక్టోపస్ పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్య..మర్డర్ వెనుక సంచలన విషయాలు