అప్పులు తెచ్చి సాగు చేసిన మిరప తోట వర్షాలకు దెబ్బతినడంతో మనస్తాపం చెంది ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
కురవి, : అప్పులు తెచ్చి సాగు చేసిన మిరప తోట వర్షాలకు దెబ్బతినడంతో మనస్తాపం చెంది ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కురవి ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కురవి మండలం హరిదాస్ తండా గ్రామ పంచాయతీ శివారు హర్యాతండాలో భూక్య హతీరాం(33) తనకున్న రెండెకరాలతోపాటు మరో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప సాగు చేశారు. ఇప్పటివరకు రూ.2.50 లక్షల పెట్టుబడి పెట్టారు. దానికితోడు పాత అప్పు రూ.4 లక్షలు ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మిరప పంట తుడిచిపెట్టుకుపోయింది. అప్పులు ఎలా తీర్చాలన్న ఆందోళనతో గురువారం పురుగు మందు తాగారు. వెంటనే కుటుంబసభ్యులు మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు.
తాజా వార్తలు చదవండి
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Diwali Lakshmi Puja: దీపావళి లక్ష్మీ పూజలో పసుపు గవ్వలు, గోమతి చక్రం ఎందుకు ఉంచుతారో తెలుసా?
- Astrology: అనుకున్నది సాధిస్తారు..! కొత్త సంవత్సరం లోపే వీరికి కొత్త జీవితం
- కర్వా చౌత్ వ్రతాన్ని మహిళలు మాత్రమే ఎందుకు పాటిస్తారు? దీని వెనుక ఉన్న విశ్వాసం ఇదే!
- భర్త నిర్వాకం..స్నేహితులతో గడపాలంటూ భార్యపై ఒత్తిడి





