గత 45 రోజులుగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ చుట్టుపక్కల గ్రామస్థులు కంటిమీద కునుకులేకుండా భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. నరమాంస భక్షక తోడేళ్లు ఈ దాడులకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే 8 మంది పిల్లలు, ఓ మహిళ మృతి చెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సమీపంలోని అడవుల్లో నుంచి తోడేళ్లు జనావాసాల్లోకి ప్రవేశించి దాడులకు పాల్పడుతున్నట్లు అందరూ..
ముజఫర్‌నగర్, సెప్టెంబర్ 4: గత 45 రోజులుగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ చుట్టుపక్కల గ్రామస్థులు కంటిమీద కునుకులేకుండా భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. నరమాంస భక్షక తోడేళ్లు ఈ దాడులకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే 8 మంది పిల్లలు, ఓ మహిళ మృతి చెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సమీపంలోని అడవుల్లో నుంచి తోడేళ్లు జనావాసాల్లోకి ప్రవేశించి దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం ‘ఆపరేషన్ భేడియా’ కూడా చేపట్టింది. సుమారు 25 నుంచి 30 గ్రామాల ప్రజలు భయంతో గజగజ వణికిపోయారు. ఇప్పటికే నాలుగు తోడేళ్లను బంధించగా.. మరో రెండింటి కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే ముజఫర్‌నగర్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇక్కడ దాడులకు పాల్పడుతోంది తోడేలో, కుక్కోకాదని, ఓ యువకుడని, అతడు నరమాంస భక్షకుడిగా మారి పలువురిని కొరికి చంపుతున్నట్లు గుర్తించారు. నరమాంస భక్షకుడిగా మారిన యువకుడు ఇప్పటికే ఓ మహిళ, బాలికతో సహా పలువురిని కరిచాడు. స్థానికులు గమనించి అతికష్టం మీద అతడి నుంచి వారిని కాపాడారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. కొందరు స్థానికులు యువకుడిని తాడుతో కట్టేసి పోలీసులకు అప్పగించారు.
ముజఫర్‌నగర్‌లోని కొత్వాలి ప్రాంతంలోని రామ్‌లీలా తిల్లా గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఓ యువకుడు వన్యప్రాణిలా ప్రవర్తిస్తూ మార్కెట్‌కు వస్తున్న వారిపై కోతుల మాదిరిగా దాడి చేయడం కలకలం రేపింది. కొద్దిసేపటికే ఆ యువకుడు డజన్ల కొద్దీ వ్యక్తులపై దాడి చేసి పళ్లతో కొరికి గాయపరిచాడు. పరిగెత్తుకుంటూ వచ్చి దొరికిన వారిని దొరికినట్లు పట్టుకుని పళ్లతో కొరికి పారిపోతున్నాడు. యువకుడి వింత ప్రవర్తన చూసి చిన్నారులు, వృద్ధులు, మహిళలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. కొందరు ధైర్యం చేసి ఆ యువకుడిని పట్టుకుని తాడుతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు యువకుడిని పట్టుకుని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స తర్వాత యువకుడిని మీరట్ మెడికల్‌కు రెఫర్ చేశారు.
సదరు యువకుడి కుటుంబ సభ్యులను విచారించిన అధికారులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. యువకుడు మద్యం, డ్రగ్స్‌కు బానిసయ్యాడని, నిత్యం మద్యం మత్తులో ఉండడం వల్ల అతడి భార్య కూడా అతడిని వదిలి వెళ్లిపోయిందని తెలిపారు. మద్యం వ్యసనం మాన్పించడానికి యువకుడికి అతని కుటుంబ సభ్యులు కొన్ని మందులు వాడటం వల్ల.. అవి వికటించడంతో యువకుడు అలాంటి పరిస్థితికి చేరుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు చదవండి
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?
- పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా?
- నేటి జాతకం లు 14 జూన్, 2026
- కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్‌కు తీసుకెళ్లి..
- మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..





