October 17, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

అన్నదమ్ములకు రాఖీ కట్టి ఆఫీస్‌కి వెళ్లింది.. అంతలోనే..



Achyutapuram Crime News: రాఖీ పండుగ సందర్భంగా ఎంతో ఆనందంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు ఇంటికి వచ్చింది. తిరిగి బయలుదేరే సమయంలో అనుకోని సంఘటన జరిగింది.

శ్రావణ మాసం ప్రారంభం అయినప్పటి నుంచి  పండుగలు.. శుభకార్యాల సీజన్ మొదలైంది. వరలక్ష్మీ వ్రతం పండుగ తర్వాత..  ఆత్మీయ అనుబంధాలకు ప్రతీక అయిన ‘రాఖీ పౌర్ణమి’19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అక్కా చెల్లెళ్లు.. అన్నదమ్ముల చేతి మణికట్టుకు రాఖీలను కట్టి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని దివిస్తారు. అన్నదమ్ములు తమకు తోచింది తోబుట్టువులకు  కానుకగా ఇస్తుంటారు. రాఖీ పండుగ పురస్కరించుకొని తన సోదరులకు రాఖీ కట్టేందుకు వచ్చింది. ఉద్యోగ బాధ్యతల కారణంగా తిరిగి వెళ్లిపోయిన ఆ యువతి జీవితంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..


ఆంధ్రప్రదేశ్ విశాఖపట్టణంలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందగా.. దాదాపు 60 మంది వరకు తీవ్ర గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖ, అనకాపల్లి హాస్పిటల్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. అచ్యుతాపురం ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.  ఫార్మ కంపెనీలో జరిగిన ప్రమాదంలో కాకినాడకు చెందిన చల్లపల్లి హారిక (22) కన్నుమూసింది. హారిక తండ్రి ఐదేళ్ల క్రితం చనిపోయాడు.. తల్లి, సోదరులు కష్టపడి హారికను చదివించారు. మొదటి నుంచి చదువుల్లో చురుకుగా ఉండే హారిక కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ‘ఎసెన్షియా’ లో చేరింది.

రాఖీ పండుగ సందర్భంగా కాకినాడకు రాగా మరో రెండు రోజులు ఉండాలని అన్నదమ్ములు కోరారు.కానీ యాజమాన్యం పరిమిషన్ ఇవ్వకపోవడంతో నిన్న ఉదయం కంపెనీకి వెళ్లి విధులకు హాజరైంది. అంతలోనే మృత్యువు హారికను ప్రమాదం రూపంలో వెంటాడింది. ఒక్క రోజు ఇంట్లో ఉన్న ఈ గండం గడిచేదని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. రికాక్టర్ పేలుడు ధాగికి కంపెనీ పై కప్పు కూలిపోవడంతో పాటు అక్క పనిచేసే కార్మికులు, సిబ్బంది 30 నుంచి 50 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారు. కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా భయానక దృశ్యాలే కనిపించాయి.

Also read

Related posts

Share via