ఆయుధాలు ధరించిన కొందరు దుండగులు జ్యువెలరీ షాప్ను దోచుకెళ్లారు. కారులో వచ్చిన వీరు షాపులోని వారిపై మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో షాపు యజమాని మరణించగా.. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి..
జైపూర్, ఆగస్టు 25: ఆయుధాలు ధరించిన కొందరు దుండగులు జ్యువెలరీ షాప్ను దోచుకెళ్లారు. కారులో వచ్చిన వీరు షాపులోని వారిపై మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో షాపు యజమాని మరణించగా.. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజస్థాన్లోని భివాడిలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.
ఆగస్టు 23న సాయంత్రం ఏడు గంటల సమయంలో ముఖాలకు ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు కారులో భివాడి సెంట్రల్ మార్కెట్ వద్ద ఉన్న కమలేష్ జ్యువెలర్స్ షాపులో చొరబడ్డారు. షాపు బయట ఉన్న సెక్యూరిటీ గార్డును కర్రతో చావగొట్టి, అతని వద్ద ఉన్న గన్ను లాక్కున్నారు. అనంతరం నగల దుకాణంలో ప్రవేశించి లోపల ఉన్న సిబ్బందిని విచక్షణా రహితంగా కొట్టారు. అడ్డుకోబోయిన యజమాని కమలేష్ సోనీని తీవ్రంగా కొట్టారు. అతడి కుమారుడు వైభవ్, షోరూమ్ సిబ్బందిని కొట్టి బంధించారు. ఈ ఘటనలో సెక్యురిటీ గార్డుతో సహా మరో ముగ్గురు గాయపడ్డారు. అనంతరం దుండగులు తమ వెంట తెచ్చిన రెండు బ్యాగుల్లో లక్షల విలువైన బంగారం, వెండి నగలను దోచుకున్నారు. దోపిడీ తర్వాత నిందితులు అక్కడి నుండి పారిపోయారు
Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





