November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

చౌక… చౌక.. తక్కువ ధరకే 2 కేజీల బంగారం దక్కించుకున్నాడు.. ఆ తర్వాత

తక్కువ ధరకు బంగారం ఆశకు పోయి అప్పుల పాలై లబో దిబో మంటున్నాడు ఓ బాధితుడు. అత్యాశకు పోయి ఉన్నదంతా పోగొట్టుకొని నకిలీ బంగారంతో బోరుమంటున్నాడు. నారాయణపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన నివ్వేర పోయేలా చేస్తోంది. మొదట అసలు బంగారం ఆశ చూపి పెద్దమొత్తంలో నకిలీ బంగారం అంటగట్టారు కేటుగాళ్లు. ఉమ్మడి జిల్లాలోనే నకిలీ బంగారం ఘటన కలకలం రేపుతోంది. తక్కువ ధరకే బంగారం కొని ఆ తర్వాత.. కొన్నది నకిలీ బంగారం అని తెలిసి మోసాయపోయిన ఘటన నారాయణపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్వ మండలం నాగిరెడ్డిపల్లి కి చెందిన రామంజి, వెంకటేష్ అనే ఇద్దరు వ్యక్తులు అదే గ్రామానికి చెందిన బాల్ రెడ్డికి తక్కువ ధరకు బంగారం అంటూ సమాచారం ఇచ్చారు. తమకు తెలిసిన వ్యక్తులేనని నమ్మించి మొదట కొంత బంగారం కొనిపించారు. అది నిజమైన బంగారం…అందులోనూ తక్కువ ధరకే లభించింది. దీంతో మరోసారి మరికొంత బంగారం కొన్నాడు బాల్ రెడ్డి. ఈ సారి కూడా నిజమైన బంగారం అమ్మారు.. అది కూడా తక్కువ ధరకే.. అయితే బంగారం నిజమైనది కావడం తక్కువ ధరకే లభిస్తున్నదని బాల్ రెడ్డి అత్యాశకు పోయాడు.

ఈసారి భారీగా బంగారం కొనాలని నిర్ణయించాడు. తన వద్ద ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నప్పటికీ సుమారు రూ.12లక్షలు అప్పు చేశాడు. ఇందుకోసం తన ఆస్తులను తాకట్టు పెట్టాడు. అయితే వచ్చిన సొమ్ము మొత్తం ఈ బంగారం కొనేందుకు ఖర్చు చేయాలని భావించాడు. దీంతో తక్కువ ధరకు బంగారం అమ్ముతున్న ముఠాను మరోసారి సంప్రదించాడు. తన వద్ద ఉన్న రూ.12 లక్షలు తీసుకొని దాదాపుగా రెండున్నర కిలోల బంగారం కొనుగోలు చేశాడు. తక్కువ ధరకే భారీగా బంగారం లభించిందని బాల్ రెడ్డి గ్రామానికి వచ్చి ఊహల్లో తెలిపోయాడు.

వీడియో చూడండి..

మొదట బంగారం నిజమైనదా కాదా అని అనుమానం రాకపోయినా గ్రామంలో ఆ నోటా, ఈ నోటా విషయం ప్రచారంలోకి వచ్చింది. దీంతో కొంత మంది అసలు అది బంగారమే కాదు అని చెప్పుకొచ్చారట. దీంతో ఎందుకైనా మంచిదని కొన్న బంగారాన్ని పరీక్షించాలని భావించాడు. స్థానికంగా బంగారం దుకాణం యజమానిని సంప్రదిస్తే అది నకిలిది అని తేలింది. అసలు బంగారం లేదు… ఏం లేదు. అన్ని రోల్ గోల్డ్ అభరణాలు అని తేలింది. దీంతో బాల్ రెడ్డి ఖంగు తిన్నాడు. మోసపోయానని గ్రహించి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు.

నమ్మించి మోసం చేశారని ఇద్దరిపై కేసు:
తనను గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రామంజి, వెంకటేష్ లు తప్పుదారి పట్టించారని బాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి మండలం కొక్కంటి గ్రామానికి సమీపంలో ఈ బంగారం విక్రయాలు జరిగాయి. నకిలీ బంగారం అంటగట్టిన వ్యవహారంలో తనను మొదట నమ్మించి మోసం చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాల్ రెడ్డి. నకిలీ బంగారం వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులకు విషయం తెలియడంతో ఒక్కసారిగా నకిలీ బంగారం వ్యవహారం కలకలం రేపింది. అప్పు చేసి నకిలీ బంగారం కొని మోసపోయానని బాల్ రెడ్డి లబోదిబోమంటున్నాడు. బంగారం పేరుతో మోసం చేసిన కేటుగాళ్లను పోలీసులు పట్టుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

Also read

Related posts

Share via