November 21, 2024
SGSTV NEWS
Telangana

కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్రైవేటు వెంచర్లలో మున్సిపల్ డబ్బులతో విద్యుత్ పోల్స్…?




– సబ్ రిజిస్టర్ లీవ్ లో ఉండగా వెంచర్కు సంబంధించిన డాక్యుమెంట్లు ఇన్చార్జిలతో రూల్స్ కు విరుద్ధంగా చేపిస్తున్నట్ట గుసగుసలు ….?

– పట్టణంలో వీధిలైట్లు లేని వార్డులు ఎన్నో ఉన్న పట్టించుకోని మున్సిపల్ అధికారులు..?


– సబ్ రిజిస్టర్ లీవ్ లో వెళ్లాలని రాజకీయ నాయకుల ఉకుం జారీ చేసినారా…?


– ముఖ్యమంత్రి పట్నం పాతాబస్తీలోఅక్రమకట్టడాలను కులిస్తే దానికి విరుద్ధంగా కామారెడ్డి…?


కామారెడ్డి జిల్లా బ్యూరో ఆగస్టు 16 : కామారెడ్డిలో మున్సిపల్ అధికారులు మాత్రం మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అనుచరుల బిల్డింగ్ మేము ఎంచేయాలెం అంటున్న అధికారులు..కామారెడ్డి మున్సిపల్ పరిధిలో జయశంకర్ కాలనీ నీ అనుకొని ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వెంచర్ కు మున్సిపల్ నుండి కరెంటు కంబాలు వేసే ఆలోచనలో ఉన్నారు.

అంటూ కామారెడ్డి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.హైదరాబాద్ లో ముఖ్యమంత్రి అక్రమకట్టడలు కులుస్తూ ఉంటే కామారెడ్డిలో అక్రమకట్టడాలు అన్ని మాజీ ఎమ్మెల్యే కీ వారి అనుచారులకి సంబంధించినవి మేము ఏమి చేయలేం అంటూ మున్సిపల్ అధికారులు చేతులు దులుపుకోవడం విడ్డూరం.మరి ఎక్కడైనా ఎవరైతే వెంచర్ చేసేవారు ఉంటారో వారు సొంతంగా డెవలప్ చేస్తామంటూ ప్లాట్లు తీసుకున్న కస్టమర్లకు ముందుగానే చెబుతూ ప్లాట్లు అమ్మడం జరుగుతుంది.కామారెడ్డిలో ఎవరు ఎక్కడ ఉన్నా అంతా మా రాజ్యమే అన్నట్టుగా రాజకీయ నాయకుల ఆగడాలు నడుస్తూనే ఉంటున్నట్టు దీన్నిబట్టి చూస్తే గతంలో బీ.ఆర్.ఎస్ పార్టీ వాళ్లు చేసిన వెంచార్కి కాంగ్రెస్ పార్టీ వాళ్లు కంబాలూ వేయడం వెనుక కాంగ్రెస్,బీ.ఆర్.ఎస్ రెండు ఒకటేనా అనే విధంగా కామరెడ్డి రాజకీయం ఒక చదరంగంల ప్రజలకు కనబడుతున్నట్టు తెలుస్తుంది,అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి వెంచర్లలో ప్లాట్లను గవర్నమెంట్ కు రావలసిన రాబడికి విరుద్ధంగా సబ్ రిజిస్టర్ను మీరు లీవ్ పెట్టుకుని వెళ్ళాలి ఇన్చార్జి తో మా ఇష్టం ఉన్నట్లు రిజిస్ట్రేషన్ లు చేయించుకుంటాం.అని కొంతమంది రాజకీయ నాయకులు ఉక్కుమ్ జారీ చేయడం జరిగిందని ప్రజలలో గుసగుసలు వినబడుతున్నాయి? ఇప్పటికి కూడా కామారెడ్డి పరిస్థితి మారకపోవడానికి గతంలో ఉన్నటువంటి నాయకుల హస్తాలు ఉన్నాయా లేదా కొత్తగా వచ్చినటువంటి నాయకులు బలంగా లేకపోవడమ అంటూ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.పట్టణ ప్రజలకు కాలనీలలోనీ కొన్ని ఏరియాలలో రోడ్లు లైటింగ్ సౌకర్యాలు లేకున్నా ప్రజలు తిరిగే చోట సమస్యలపై లేని చిత్తశుద్ధి ఎక్కడో ఊరు బయట ఎలాంటి ఇంటి నిర్మాణం లేని ఏరియాలో కరెంట్ కంబాలు వేయడం వెనుక మున్సిపల్ అధికారులకు గాని పాలకులకు కానీ ఏమైనా వాటాలు ఉన్నాయని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు..

Also read

Related posts

Share via