కామారెడ్డి జిల్లా బ్యూరో ఆగస్టు: 17 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మహిళలకు హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకం అమలు చేసి ఆర్టీసి బస్సుల్లో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణంపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావని వాటిని వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మహిళలను కించపరుస్తూ బస్సులలో బ్రేక్ డాన్స్ లు,రికార్డింగ్ డాన్స్ లు చేసుకోండని మహిళల పట్ల కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు బస్సుల్లో ప్రయాణించే మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణ మహిళా సమాజం పట్ల ఆయనకున్న గౌరవం ఏంటో తెలిసిపోయిందన్నారు.ఇంత అవమానకరంగా మాట్లాడి మహిళల ఆత్మగౌరవాన్ని కేటీఆర్ దెబ్బతీశారన్నారు మహిళలపై ఆయన వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలపై రాష్ర్ట మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవడం హార్షణియమన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఇకనైనా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





