• హత్యకేసును ఛేదించిన పోలీసులు
భార్య, ప్రియుడి అరెస్ట్
బనశంకరి: పెడదారి పట్టిన ఓ మహిళ తన సుఖానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. వైట్ఫీల్డ్ హగదూరులో ఈనెల 9న జరిగిన మహేశ్ (36) అనే వ్యక్తి హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు. భార్య తేజస్విని, ప్రియుడు గజేంద్ర(35)ను అరెస్ట్ చేశారు. హాసన జిల్లా అరకలగూడు దొంబరపాళ్య నివాసి మహేష్తో తేజస్విని అనే మహిళకు కొద్ది సంవత్సరాల క్రితం వివాహమైంది. దంపతులు వైట్ఫీల్డ్ హగదూరులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
తేజస్విని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రుణాలు వసూలుచేసే విభాగంలో పనిచేసేది. గత ఏడాదినుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తేజస్విని సహద్యోగి గజేంద్రతోవి వాహేతర సంబంధం పెట్టుకుందని మహేశ్ గుర్తించి మందలించాడు. గజేంద్రకు ఫోన్ చేసి హెచ్చరించాడు. కానీ వివాహేతర సంబంధం కొనసాగించారు. ఈనెల 9న తేజస్విని గజేంద్ర ఇంట్లో ఉండగా మహేశ్ గమనించాడు. భార్యపై దాడికి పాల్పడగా అడ్డుకోవడానికి ప్రయత్నించిన గజేంద్రపై కూడా మహేశ్ దాడిచేశాడు.
ఈ సమయంలో తేజస్విని, గజేంద్రలు మహేశ్ గొంతు నులిమి హత్య చేశారు. హత్యను కప్పిపుచ్చేందుకు తేజస్విని నాటకం ఆడింది. తన భర్త ఉన్నఫళంగా కుప్పకూలి మృతి చెందినట్లు స్థానికులను నమ్మించింది. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వైట్ఫీల్డ్ పోలీసులు తేజస్వినిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా తప్పు ఒప్పుకుంది. భర్తను హత్యచేయడానికి ప్రియుడు గజేంద్ర సహకరించాడని తెలిపింది. ఇద్దరిని పోలీసులు అరెస్ట్చేసి విచారణ చేపడుతున్నారు.
Also read
- తీర్థం తీసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? అయితే అపచారమే
- శని దోషాలు: శని దోషాలతో బాధ పడుతున్నారా? భయం వద్దు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!
- శని నక్షత్ర మార్పు: ఏప్రిల్ 17 నుంచి ఈ 5 రాశుల వారికి తిరుగుండదు.. పట్టరాని అదృష్టం!
- నేటి జాతకములు..18 ఏప్రిల్, 2026
- భవన నిర్మాణ కార్మికుల కు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.





