ఓ కాఫీ షాపులో పనిచేస్తున్న వ్యక్తి వాష్రూమ్ డస్ట్బన్ కెమెరా ఆన్ చేసి సెల్ ఫోన్ ఉంచిన ఘటన బెంగళూరులో జరిగింది.
బెంగళూరు: బెంగళూరులోని ఓ ప్రముఖ కాఫీ షాపులో పనిచేస్తున్న ఓ వ్యక్తి అత్యంత నీచమైన చర్యకు పాల్పడ్డాడు. మహిళల వాష్రూమ్లో ఉన్న చెత్తబుట్టలో సెల్ఫోన్ను ఉంచాడు. దాన్ని ఫ్లైట్ మోడ్లో ఉంచి కెమెరాను ఆన్ చేసి పెట్టాడు. దీన్ని గమనించిన ఓ మహిళ అక్కడున్న యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
దాదాపు రెండు గంటల నుంచి కెమెరా రికార్డింగ్ మోడ్లో ఉన్నట్లు గుర్తించారు. ఫోన్ను చెత్తబుట్టలోని ఓ సంచిలో చాలా జాగ్రత్తగా అమర్చినట్లు సదరు మహిళ తెలిపారు. కెమెరాకు ఏమీ అడ్డు రాకుండా సంచికి చిన్న రంధ్రం చేసి టాయిలెట్ సీట్ దిశగా ఉంచారని వివరించారు. ఈ వ్యవహారాన్ని గ్యాంగ్స్ ఆఫ్ సినీపుర్ పేరిట ఉన్న ఓ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఈ ఉదంతం ఓ ప్రముఖ కాఫీ విక్రయశాలలో జరిగినట్లు తెలిపారు. ఎంత ఫేమస్ అయిన సంస్థలైనా మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
దీనిపై సదరు కాఫీ విక్రయ సంస్థ స్పందించింది. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసింది. తమ ఔట్లెట్లలో ఇలాంటి దుశ్చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని పేర్కొంది. సదరు వ్యక్తిని వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేసినట్లు వెల్లడించింది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా ఔట్లెట్లు ఉండడం గమనార్హం. ఈ విషయం పోలీసుల దృష్టికి రావటంతో సదరు వ్యక్తిని అరెస్టు చేశారు.
Also read
- Telangana: తస్మాత్ జాగ్రత్త..ఈ నెంబర్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకండి.. చేశారో.. కొంప కొల్లేరే!
- రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ దారుణ హత్య.. తాళ్లతో బంధించి చిత్ర హింసలు పెట్టి…..
- AP News: ఆయుర్వేదం చాక్లెట్ల పేరుతో ఇవి అమ్ముతున్నారు.. తిన్నారో..
- Andhra Pradesh: ఆమె సాఫ్ట్వేర్.. అతడు ఫుడ్ బిజినెస్.. ఇంతకీ రూమ్లో అసలు ఏం జరిగిందంటే..
- Telangana: మోజు తీరిన తరువాత అవౌడ్ చేశాడు.. పాపం ఆ యువతి.. వీడియో