SGSTV NEWS online
Andhra PradeshCrime

Divvela Madhuri: దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం.. తలకు తీవ్ర గాయాలు

దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూలో గత రెండు మూడు రోజులుగా వార్తల్లో నిలిచిన దివ్వెల మాధురి ఆతహత్యాయత్నం చేశారు. కారుతో హైవేపై వెళ్తూ.. ఆమె ఆగి ఉన్న కారును ఢీకొట్టారు. కారు బోల్తా పడటంతో మాధురికి తీవ్రగాయాలయ్యాయి.


దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు.. మాధురి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆగి ఉన్న కారును మాధురి తన కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా.. లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే ఆమెను పలాస గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో మాధురి ఒక్కరు మాత్రమే ఉన్నారు. అయితే దువ్వాడ వాణి ఆరోపణలు, సోషల్ మీడియా ట్రోల్స్ భరించలేక తాను సూసైడ్ చేసుకోవాలని కారును ఢీ కొట్టినట్లు మాధురి చెప్తుంది. తనకు ఎలాంటి చికిత్స వద్దని ఆమె ఆస్పత్రిలో మొండికేసింది. తన పిల్లలపై చేసిన ఆరోపణలకు పోలీసులు దువ్వాడ వాణిని అరెస్ట్ చేయకపోతే.. తాను మళ్లీ వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని ఆమె చెబుతోంది 

Also read

Related posts