Hyderabad Crime News: చట్ట ప్రకారం కట్నం ఇవ్వడం నేరమే.. తీసుకోవడం నేరమే. కానీ ఇవి లేనిదే పెళ్లి జరగవు అన్న నిజం అందరికీ తెలిసిందే. వరకట్న వేధింపులకు ఎంతోమంది మహిళలు బలిఅవుతున్నారు.
దేశంలో ఎక్కడో అక్కడ వరకట్న దాహానికి ఎంతోమంది మహిళలు బలిఅవుతూనే ఉన్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు వరకట్నం లేనిదే పెళ్లి తంతు ముందుకు సాగదు అంటారు. వరకట్నం దురాచారాన్ని రూపుమాపడానికి ఎంతో మంది సంఘసంస్కర్తలు కొన్నేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ వారి ప్రయత్నాలు వృధా అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరకట్న భయానికి ఆడపిల్ల పుట్టిన వెంటనే హతమార్చుతున్నారు. వరకట్నం ముసుగులో కొంతమంది దారుణమైన మోసాలకు పాల్పపడుతున్నారు. మరికొంతమందికి ఇచ్చిన కట్నం చాలక అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను చిత్ర హింసలకు గురి చేస్తున్న ప్రబుద్దులు ఉన్నారు. వరకట్న దాహానికి మరో మహిళ బలైంది.. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ హయత్ నగర్‌లో విషాద సంఘటన వెలుగు చూసింది. భర్త పెట్టే చిత్ర హింసలు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పపడింది. గత ఏడాది మే నెలలో సుజాత అనే యువతికి శివ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. పెళ్లి సమయంలో శివ కోరినంత కట్నం ఇచ్చి పెళ్లి తంతు పూర్తి చేశారు సుజాత కుటుంబ సభ్యులు. అయితే ఇచ్చిన కట్నం సరిపోలేదని తనకు అదనపు కట్నం కావాలని కొన్ని నెలలుగా సుజాతను హింసిస్తు వస్తున్నాడు. తన పెళ్లికి లక్షలు ఖర్చు చేశారని.. మళ్లీ తాను అదనపు కట్నం ఎలా తీసుకురావాలని సుజాత చెప్పడంతో ఆమెపై చేయి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు పుట్టినింటిలో చెప్పుకోలేక.. భర్త పెట్టే టార్చర్ భరించలేక సుజాత ఆత్మహత్యకు పాల్పపడినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ సుజాత కుటుంబ సభ్యుల వర్షన్ వేరే ఉంది.
సుజాత ఆత్మహత్య చేసుకుందన్న వార్త విన్న కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు. వెంటనే హైదరాబాద్ చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమ కూతురుని వరకట్నం కోసం హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని.. ఇందుకు కారణం అయిన భర్త పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ధర్నా కారణంగా విజయవాడ హైవే పై కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిదింది. శివపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య? ఆత్మహత్యా? అన్న కోణంలో విచారణ చేస్తున్నాని పోలీసులు తెలిపారు.
- Garuda Puranam: మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా..?
- Goddess Pydithallamma: విజయనగరం గ్రామ దేవత.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడిమాంబ చరిత్ర..
- స్త్రీలు తలస్నానం చేసేందుకు నియమాలున్నాయని తెలుసా.. ఏరోజున చేయడం శుభప్రదం అంటే..
- May 2025 Horoscope: వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే ఛాన్స్.. 12 రాశులకు మే మాసఫలాలు
- Garuda Puranam: పునర్జన్మ అంటే ఏంటి..? గరుడ పురాణం ఏం చెబుతోంది..?