November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

Chain Snatches: ఓరుగల్లులో మళ్ళీ రెచ్చి పోతున్న చైన్ స్నాచర్లు.. ఖాకీల నిఘా కొరవడిందా.?

వరంగల్ మహానగరంలో చైన్ స్టార్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలు కనపడితే చాలు తెగబడి తాళిబొట్లు పెంచుకుబోతున్నారు. వరుసగా రెండు ఘటనలు జరగడం నగర ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తీరికగా విచారణ చేపట్టిన పోలీసులు ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నారు.


వరంగల్ మహానగరంలో చైన్ స్టార్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలు కనపడితే చాలు తెగబడి తాళిబొట్లు పెంచుకుబోతున్నారు. వరుసగా రెండు ఘటనలు జరగడం నగర ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తీరికగా విచారణ చేపట్టిన పోలీసులు ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నారు. ఖాకీల నిఘా కొరవడడమే చైన్ స్నాచింగ్‌లకు కారణమా..? ఆ మహా నగరంలో అసలేం జరుగుతుంది..? అన్నదీ ఇప్పటి హాట్ టాపిక్‌గా మారింది.


వరంగల్ మహానగరంలో పోలీసుల నిఘా నిద్ర పోతుంది. ఒకవైపు గంజాయి విక్రయాలు, చోరీలు, హత్యలు పెరిగి పోతుంటే మరోవైపు చైన్ స్నాచర్లు రెచ్చి పోతున్నారు. తాజాగా జరిగిన వరుస చైన్ స్నాచింగ్స్ అటు పోలీసులు, ఇటు నగర ప్రజలను కలవర పెడుతున్నాయి. అనూహ్యంగా ఒకేరోజు రాత్రి రెండు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్స్ జరిగాయి.

ఇద్దరు యువకులు స్కూటర్ పై వచ్చి రెండుచోట్ల మహిళల మెడలో నుండి బంగారం గొలుసులను అపహరించుకుపోయారు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తవాడలో కూతురుతో కలిసి కాలినడకన వెళ్తున్న ఓ మహిళను స్కూటర్ పై వెంబడించిన ఇద్దరు యువకులు ఆమె మెడలో నుంచి బంగారం పుస్తెల తాడు లాక్కెళ్లారు. మరో గంటన్నర వ్యవధిలో ఇదే వరంగల్‌లోని ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ చౌరస్తా సమీపంలోని మేదరివాడలో మరో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు.. ఓ దుకాణం నిర్వాహకురాలిని మాటల్లోకి దింపి ఇద్దరు యువకులు ఆమె మెడలోని బంగారం గొలుసును అపహరించారు.


రెండుచోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడింది ఆ ఇద్దరు యువకులేనని పోలీసులు గుర్తించారు. వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. యువకులు వైట్ కలర్ యాక్టివాపై వచ్చారని, ఆ ఇద్దరూ తెలుగులో మాట్లాడినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. రెండు ఘటనలకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితులు స్థానికులే అయి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల్లో ఒకరి ఫొటోను విడుదల చేశారు. చైన్ స్నాచర్ల ను పట్టించిన వారికి బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు

Related posts

Share via