December 3, 2024
SGSTV NEWS
Andhra PradeshPolitical

Vijaysai Reddy: మదన్‌ నన్ను రెండుసార్లు కలిశాడు.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు: విజయసాయిరెడ్డి

రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారు.. వైసీపీ నాయకులపై కావాలనే బురదజల్లుతున్నారు.. అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తనపై కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. మహిళకు ద్రోహం చేశానని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని.. ఎవరినీ వదిలిపెట్టబోనని పేర్కొన్నారు. తన పేరు, ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్న వారినీ ఎవరీ వదిలేది లేదని.. దుష్ప్రచారం చేస్తున్నవారు తమ పార్టీవాళ్లైనా వదలను అంటూ విజయసాయిరెడ్డి చెప్పారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడనన్నారు. మదన్‌ అనే వ్యక్తి రెండుసార్లు తనను కలిశాడని.. స్కాలర్‌షిప్‌ కోసం వస్తే సహకరించా అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Also read :భర్త కోసం వెయిట్ చేస్తోంది.. వచ్చేలోపే అంతా జరిగిపోయింది

ప్రతిపక్షంలో ఉన్నామని వెనక్కి తగ్గేదిలేదని.. మధ్యంతర ఎన్నికలు జరిగినా తామే అధికారంలోకి వస్తామన్నారు. అధికారంలోకి వస్తామని.. చట్టపరంగా ముందుకువెళతామన్నారు. దీనిపై మహిళా కమిషన్‌ సహా అన్ని కమిషన్లకూ ఫిర్యాదు చేస్తామని.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు

Also read :ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది! కానీ ఆ టార్చర్ భరించలేక…

త్వరలోనే ఛానల్‌ పెడతా..
చదువు రాని వాళ్ళు ఛానల్‌ పెడుతుంటే చదువుకొని ఎంపీ నైన నేను పెట్టలేనా అనివిజయసాయిరెడ్డి అన్నారు. త్వరలో నేను ఛానెల్‌,పేపర్‌ ప్రారంభం చేస్తానని.. ఒకే కులం ఉన్న మీడియా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం తీరు ప్రజలకు అర్థమైందని తెలిపారు.

వీడియో…

Also read :Job Fraud: భాగ్యనగరంలో ఘరానా మోసం.. రూ.24 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన జాగృతి కన్సల్టెన్సీ

తెల్లారితే గృహప్రవేశం.. కలలుకన్న దంపతులు.. దర్శనమిచ్చిన కాళరాత్రి..

Watch Video: సర్టిఫికేట్ల కోసం వచ్చిన విద్యార్థి.. స్పృహ కోల్పోవడంతో వెలుగులోకి షాకింగ్ నిజాలు..

Related posts

Share via