తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్కల్యాణా కలిసి తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) వేదికపై ఆసీనులయ్యారు. వేదికపై చంద్రబాబు కోసం ప్రత్యేక కుర్చీని సిద్ధం చేయగా ఆయన తిరస్కరించారు. కూటమి నేతలందరికీ ఒకే తరహా కుర్చీ ఉండాలని మరో కుర్చీని తెప్పించి దానిపై కూర్చొన్నారు. దీంతో చంద్రబాబు సంస్కారాన్ని అభిమానులు అభినందిస్తున్నారు.
Also read
- కార్పొరేట్ స్కూల్ సూపర్వైజర్ కామ చేష్టలు
- వాల్మీకిపురంలో MLA అనుచరుల వీరంగం..టోల్ గేట్ సిబ్బందిపై దాడి
- వీడియోలతో బెదిరిస్తూ… పదేళ్లుగా లైంగికదాడి
- కట్టుకోబోయేవాడే చంపాడు..
- విద్యార్థినిపై టీచర్ ప్రేమ.. ఆమె కోసం అర్ధరాత్రి..





