విశాఖపట్నంలో ఓ యువకుడు అర్థరాత్రి నానా హంగామా సృష్టించాడు. హోర్డింగ్ ఎక్కి.. చేతిలో కత్తి పట్టుకుని.. దగ్గరకు వస్తే చస్తానని బెదిరించాడు. ఎందుకంటే
నిరసన తెలపడానికి అనేక మార్గాలుంటాయి. రోడ్డు మీద బైఠాయించడం, నిరాహార దీక్ష చేయడం, పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటాను అని బెదిరించడం, అధికారులు, నేతలను అడ్డగించడం.. మోసం చేసిన వారి ఇంటి ముందు బైఠాయించడం వంటివి చేస్తుంటారు. ఇక నేటి కాలంలో చాలా మంది వీటన్నింటిని కాదనుకుని.. సెల్ టవర్లు, హోర్డింగ్‌లు, బిల్డింగ్‌ల మీదకు ఎక్కి నిరసన తెలుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా వైజాగ్‌లో ఓ యువకుడు హోర్డింగ్ ఎక్కి హల్చల్ చేశాడు. రాత్రి సమయంలో పోలీసులకు చుక్కలు చూపాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఆ యువకుడికి రెండు నెలల క్రితమే ప్రేమ వివాహం జరిగింది. మరి ఇంతలోనే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు.. అతడికి వచ్చిన సమస్య ఏంటి అనేది తెలియాలంటే..
విశాఖ బీచ్‌రోడ్డులో ఓ యువకుడు హోర్డింగ్ ఎక్కి హల్చల్ చేశాడు. తన దగ్గరకు రావాలని చూస్తే.. కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని.. చేతిలో కత్తి పట్టుకుని మరీ బెదిరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని.. సదరు యువకుడిని కిందకు దింపేందుకు ప్రయత్నించారు. కానీ అతడు మాత్రం వారి మాట వినలేదు.. యువకుడిని కిందకు దించేసరికి పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చినట్లైంది. ఇంతకు ఆ యువకుడు ఎందుకు ఇలాంటి పని చేశాడు అంటే.. భార్య కోసం. అవును రెండు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఆమె పుట్టింటి వారు అతడి వద్ద నుంచి తీసుకెళ్లిపోయారు. దాంతో తన భార్యను తనకు అప్పగించాలంటూ ఆ యువకుడు ఇలా హోర్డింగ్ ఎక్కి హల్చల్ చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు ఐటీఐ చదివాడు. ఈ క్రమంలో అతడు తన కాలేజీలో సూపర్ జూనియర్‌గా ఉన్న యువతిని ప్రేమించాడు. అయితే వీరి ప్రేమలను ఇరు పెద్దలు అంగీకరించలేదు. దాంతో రెండు నెలల క్రితం సింహాచలం వెళ్లి.. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో యువతి తండ్రి.. తన కుమార్తె కనిపించకుండా పోయిందంటూ.. పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ క్రమంలో యువతి అనారోగ్యం పాలైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. ఆమెను పుట్టింటికి తీసుకెళ్లిపోయారు.
Also read
- ఈ రెండు చెట్లు ఇంట్లో ఉంటే డబ్బు అస్సలు నిలవదట..! మీ ఇంట్లో ఉన్నాయా..?
- Astrology Tips: మీ తలపై బల్లి పడిందా?.. ఆ పెద్ద మార్పుకు టైమ్ దగ్గరపడినట్టే!
- ఇంట్లో శివలింగం పెట్టేముందు ఈ నియమాలు తెలుసుకోండి.. లేదంటే శివదోషం తప్పదట!
- పోలీసులను చూసి పరుగో పరుగు.. పట్టుకుని విచారించగా బయటపడిన షాకింగ్ నిజం
- ఎవడ్రా నువ్వు.. దొంగతనానికి వచ్చి వండుకుని తిని.. పోలిసులకే సవాల్ విసిరావ్..





