మహారాష్ట్రలో అంబేద్కర్ జయంతి సందర్భంగా డీజే ప్లే చేస్తూ.. అందరూ ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. అకస్మాత్తుగా DJ వాయిస్ ఎక్కువగా వినిపించడంతో అందరి తలలు ఒక్కసారిగా మొద్దుబారడం ప్రారంభించాయి. డీజే పెద్ద శబ్దం విని 250 మంది ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. వారికి ఏమీ వినిపించలేదు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. దీంతో 70 మంది బాధితులు ఆసుపత్రులో చికిత్స నిమిత్తం చేరారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు
ఏప్రిల్ 14న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున క్రాంతి చౌక్‌లో డీజే సాంగ్స్ తో ఉత్సవాలు జరుపుకుంటున్నారు. సిటీలో జరుగుతున్నా ఈ ఈవెంట్ కోసం పూణే నుంచి 15 మంది డీజేలను ఆహ్వానించారు. చెవులు చిల్లులు పడే విధంగా డీజే సాంగ్స్ పెట్టుకుని డీజేలతో కలిసి జోరుగా యువత డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా DJ సాంగ్స్ సౌండ్ దాదాపు 150 డెసిబుల్స్ ఉంది.
DJ ఏ వయస్సు వ్యక్తులపై చెడు ప్రభావాన్ని చూపించిందంటే
డీజే శబ్దం విని అక్కడున్న వారి ఆరోగ్యం క్షీణించింది. DJ సౌండ్ విని అస్వస్థతకు గురైన వారి వయస్సు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అస్వస్థతకు గురైన వారిలో వృద్ధులు కాదు యువతే ఎక్కువగా ఉంది. డీజే వాయిస్ విన్న 17 నుంచి 40 ఏళ్ల లోపు వారి చెవులు మొద్దుబారిపోయాయి. ఈ వయస్సులో ఉన్న 250 మంది రోగులను ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం పంపాల్సి వచ్చింది.
మూడు సర్కిళ్లపై కేసు నమోదు
నిర్దేశిత పరిమితిని మించిన వాల్యూమ్‌లో DJ ప్లే చేసినందుకు మూడు సర్కిల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. శబ్ద కాలుష్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను క్రాంతి చౌక్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్‌తో పాటు పర్యావరణ పరిరక్షణ చట్టం, శబ్ద కాలుష్య నియంత్రణ చట్టం కింద మూడు సర్కిళ్లపై కేసు నమోదు చేశారు.
ఎవరికైనా డీజే శబ్దం విని చెవులు మొద్దుబారిపోతే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. 72 గంటల ఆలస్యంచేస్తే ఆ వ్యక్తి చెవిటివారిగా మారే అవకాశం కూడా ఉందని వెల్లడించారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం