చేసుకొని.. ఎనిమిదో పెళ్లి చేసుకోబోతూ.. మరో రెండు పెళ్లిళ్లకు కూడా ప్లాన్ చేసింది. అంతే కాకుండా ఆమెకు రెండేళ్ల చిన్నారి కూడా ఉండడం ఇక్కడ మరో ట్విస్ట్ అని చెప్పాలి. చివరకు పోలీసుల చేతికి చిక్కడంతో అసలు బాగోతం బయటపడింది.
కేరళకు చెందిన 30 ఏళ్ల మహిళ రేష్మా అనే ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 పెళ్లిళ్లు చేసుకుంది. అయితే ఎవరికి అనుమానం రాకుండా అందరితోనూ షెడ్యూల్ చేసుకుని మరి ఫోన్లు మాట్లాడేది. రెండేళ్ల బిడ్డకు తల్లి అయిన రేష్మ, ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ సైట్‌లలో యువకులను సంప్రదించేది. అందరికీ ఒకే కథనే చెప్పేది. తాను దత్తత తీసుకున్న కుమార్తెనని, తన పెంపుడు తల్లి తన వివాహాన్ని వ్యతిరేకిస్తుందని, వేధింపులకు గురిచేస్తుందంటూ వారికి చెప్పేది. ఆమె భావోద్వేగ కథకు ప్లాట్ అయిన యువకులు ఆమెను వివాహం చేసుకుని, వివాహ ఖర్చులన్నీ భరించేవారు.
రకరకాల కారణాలు చెబుతూ
పెళ్లాయ్యాక కొన్ని రోజుల తర్వాత రకరకాల కారణాలు చెబుతూ అక్కడినుంచి తప్పించుకునేది. రేష్మ మొదటి వివాహం 2014లో ఎర్నాకులానికి చెందిన ఓ స్థానికుడితో జరిగింది, ఇది 2017 వరకు కొనసాగింది. ఆ తర్వాత ఆమె ఈ మోసాలకు దిగింది. 2022 నాటికి రేష్మ మరో నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది. తిరువనంతపురం, అంగమాలి, తొడుపుళ, వాలకం నుండి వచ్చిన వ్యక్తులను వివాహం చేసుకుంది. కొల్లం స్థానికుడిని వివాహం చేసుకుని అతనితో ఆమె చాలా కాలం జీవించింది. ఫలితంగా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, అత్తమామల నుండి చాలా రకాల సందేహాలు రావడంతో అక్కడినుంచి కూడా తప్పించుకుంది.
తిరువనంతపురం శివార్లకు చెందిన ఒక పంచాయతీ సభ్యుడితో పెళ్లి ఫిక్స్ చేసుకుంది రేష్మ. అయితే పంచాయతీ సభ్యుడి స్నేహితుడి భార్య రేష్మను గుర్తుపట్టి అసలు విషయం బట్టబయలు చేసింది. ఆమె హ్యాండ్ బ్యాగ్‌ను తనిఖీ చేయగా.. గత వివాహాలకు సంబంధించి పలు డాక్యుమెంట్లు బయటపడ్డాయి. వెంటనే పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. రాబోయే వారాలలో రేష్మ మరో ఇద్దరు యువకులతో వివాహానికి షెడ్యూల్ రెడీ చేసుకుంది.
Also read
- TG News: తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!