అమీర్ పేట్ : ఎటీఎంలలో పెట్టాల్సిన నగదు భారీగా మాయమైన ఘటన హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
ఏటీఎంలలో నింపాల్సిన నగదు నుంచి రూ.1.20 కోట్లకు పైగా డబ్బు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్ లోని సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ బ్రాంచ్ మేనేజర్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
సాధారణంగా సీఎంఎస్ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి నగదును తీసుకుని ఏటీఎంలలో నింపుతుంది. ఇటీవల నిర్వహించిన ఆడిట్లో ఎస్సార్‌నగర్ పరిధిలోని 31 ఏటీఎంలలో తనిఖీలు చేపట్టగా.. 8 ఏటీఎంలలో భారీగా నగదు కొరత ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.1,20,98,500 నగదు లోటు ఉన్నట్లు తేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు కస్టోడియన్లపై అనుమానం వ్యక్తమవుతోంది. వారు విధులకు హాజరు కాకపోవడం.. ఫోన్ కాల్స్క స్పందించకపోవడంతో అనుమానం మరింత పెరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Also read
- హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి అరెస్టు
- బెంగళూరులో 1,154 స్పా, మసాజ్ పార్లర్లపై తనిఖీ
- కాల భైరవ అష్టమి.. డిసెంబర్ 1న ఈ 5 ఆచారాలు పాటిస్తే భైరవుడి అనుగ్రహం లభిస్తుందట!
- కార్తీక సోమవారం వ్రత మహిమ.. కుక్కగా పుట్టిన మహిళకు కైలాస ప్రాప్తి ఎలా కలిగిందో తెలుసా?
- కార్తీక మాసంలో శివపార్వతుల శాంతి కళ్యాణం*
భద్రాచలం, నవంబరు 29:





