July 7, 2024
SGSTV NEWS
Andhra Pradesh

డ్వాక్రా మహిళల అండగా.. బలరాముడి ఉద్యమం

–*జి-యర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదుట డ్వాక్రా మహిళలతో కలిసి ధర్నా చేసిన ఎమ్మెల్యే బత్తుల*

— *బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగి నాని బాబు, అతనికి సహకరించిన వారి అవినీతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల డిమాండ్*

డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా చేసిన బ్యాంకు ఉద్యోగిపై తక్షణం చర్యలు తీసుకోవాలని *రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ* డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని జి-యర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద డ్వాక్రా మహిళలతో కలిసి శుక్రవారం ధర్నా నిర్వహించారు. తమకు చెందిన సుమారు 80 లక్షల రూపాయలను బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ గా పని చేస్తున్న నాని బాబు అనే వ్యక్తి కాజే సాడని సుమారు వెయ్యి మంది మహిళలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ మహిళల ఆందోళనకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సంపూర్ణ మద్దతు తెలియజేసి.. ఆయన కూడా ఉద్యమించారు. ఎంతో కష్టపడి డ్వాక్రా మహిళలు సొమ్ములు దాచుకుంటే… ఆ మొత్తాన్ని బ్యాంకు ఉద్యోగి నాని బాబు దోచుకోవడం ఏమిటని *ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ* తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన డ్వాక్రా మహిళలను వంచించడం దారుణమైన విషయం అన్నారు. వెంటనే బ్యాంక్ అధికారులు ఈ అవినీతికి పాల్పడిన బ్యాంకు ఉద్యోగి నాని బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని *ఎమ్మెల్యే బలరామకృష్ణ* డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళలకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వయంగా ఉద్యమించడంతో బ్యాంక్ అధికారులు దిగివచ్చారు. ఎమ్మెల్యే బలరామకృష్ణతో చర్చలు జరిపారు. డ్వాక్రా మహిళల సొమ్ము కాజేసిన ఉద్యోగి నాని బాబుపై విచారణ జరిపి .. కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు.బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు వారికి పూర్తిగా అండగా ఉంటామని బలరామకృష్ణ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వయంగా రంగంలోకి దిగడంతో బ్యాంక్ అధికారులు చర్చలకు వచ్చి.. బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ & రికవరీ అధికారులు కృష్ణ గారు, సురేష్ గారు,తూర్పుగోదావరి జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ NVVS మూర్తి గారు డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ జనార్ధన్ గారు,అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ హేమ గారు,డీఎస్పీ శ్రీనివాసులు గారు,సర్కిల్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాధ్ గారు,ఎస్సై 1 పవన్ కుమార్ గారు,ఎస్సై 2 మనోహర్ గారు అధికారుల సమక్షంలో వారి ఎదుట 45 రోజులలో బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే *”బత్తుల”.*

Related posts

Share via