SGSTV NEWS online
CrimeTelangana

హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో.. అర్ధరాత్రి ఓ మహిళ ఎంట్రీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..



హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి  అర్ధరాత్రి ఊహించని ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అనారోగ్యమని చెప్పి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన ప్రతాపం చూసింది. ఆమె వీరంగం తట్టుకోలేని ఆసుపత్రి సిబ్బంది నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చినా ఆమె తీరు ఏ మాత్రం మారలేదు. అసలేం జరిగింది?

ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు ప్రకారం.. హైదరాబాద్ ఎల్బి నగర్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో అర్ధరాత్రి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి అంటే సుమారు రెండు గంటల సమయంలో అంటే తెల్లవారితే ఆదివారం. పేషెంట్ పేరుతో ఆసుపత్రిలోకీ ఎంట్రీ ఇచ్చిన లలిత అనే మహిళ. కడుపునొప్పి ఉందంటూ అత్యవసర విభాగానికి వచ్చింది.

నిజమేనని నమ్మి ఆసుపత్రి సిబ్బంది ఆమెకు బెడ్ ఏర్పాటు చేశారు. విధుల్లో ఉన్న వైద్యులు ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి ఎలాంటి అనారోగ్య సమస్య లేనట్టు నిర్ధారించారు. అయితే ఆ మహిళ ఆలోచన ఏంటో తెలీదు. తాను వేసుకున్న ప్లాన్ ప్రకారం.. తొలుత అక్కడికి వచ్చిన ఆసుపత్రి సిబ్బందిపై మాట్లాడుతూ మరొక వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేసింది. ఒక్కసారిగా ఎమర్జెన్సీ వార్డులోని స్టాప్ అలర్ట్ అయ్యారు.



మిడ్నైట్ ఓ మహిళ ఎంట్రీ, ఆ తర్వాత దాడి, ఆపై ఏం జరిగిందంటే

ఈలోగా సదరు వ్యక్తి వద్దకు వెళ్లి చేతులు పట్టుకుని కాలుతో తన్నడం మొదలు పెట్టింది. ఆసుపత్రి సిబ్బంది జోక్యం చేసుకున్నప్పటికీ ఆమె దురుసు ప్రవర్తన ఏ మాత్రం తగ్గలేదు. ఈ తతంగమంతా మిడ్నైట్ 2.51 నిమిషాలకు జరిగింది. ఆ తర్వాత 2.56 నిమిషాలకు మరొక సీన్ చోటు చేసుకుంది.

ఆమెని నర్సు బెడ్పై కూర్చొబెడుతుండగా ఆగ్రహానికి లోనైంది సదరు మహిళ. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించింది. విధులకు ఆటంకం కలిగించి, భౌతిక దాడికి పాల్పడడం దిగింది. సెకండ్ సీన్లో పోలీసులు అక్కడే ఉన్నారు. ఈ ఘటనతో అత్యవసర విభాగంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు.



ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆసుపత్రి సిబ్బంది. ఎల్బీ నగర్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటన తర్వాత సంబంధిత మహిళ కారును స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వనస్థలిపురంలోని మరొక ఆసుపత్రికి వెళ్లింది.

గతంలో కొందరు తమ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు చేశారని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన ముందస్తు ప్రణాళికలో భాగమా? దీని వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ చేపట్టాలని పోలీసులను కోరింది ఆసుపత్రి యాజమాన్యం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Also read

Related posts