హైదరాబాద్, నాగోలు: సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని, ఏఐ ఫోటోలను ఉపయోగించి ఆర్మీ అధికారినని నమ్మిస్తూ ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిని గురువారం నాగోలు పోలీసులు అరెస్టు చేశారు.
నాగోలు ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపిన మేరకు.. నాగోలు ఆనంద్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు సోషల్ మీడియా ద్వారా శామీర్‌పేట్‌కు చెందిన ముకేరా గోవర్ధన్ (29) పరిచయమయ్యాడు. తాను భారత సైన్యంలో అధికారినని చెప్పి ఏఐ ఫోటోలను పంపి నమ్మించాడు. ఆ తరువాత ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలు చెప్పాడు.
ఈ క్రమంలో యువతితో సహజీవనం సాగించాడు. తండ్రి చికిత్స కోసం డబ్బు అవసరం ఉందని పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నాడు. ఆ తరువాత పెళ్లి గురించి నిలదీయగా బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు నాగోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా నిందితుడికి ఇప్పటికే వివాహం జరిగిన విషయం విచారణలో బయటపడింది. అంతేకాక, గత ఏడాది ఆల్వాల్ కు చెందిన మరో మహిళను కూడా పెళ్లి పేరుతో మోసం చేసి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
Also read
- పెళ్లి పేరుతో మోసం.. యువకుడి అరెస్ట్
- లాడ్జ్ యువతి అనుమానాస్పద మృతి
- దంపతుల ప్రాణం తీసిన క్షణికావేశం.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం..!
- పెళ్లి చేసుకోకు.. పురుగు మందు తాగి చచ్చిపో..!
- ఒత్తిడి భరించలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య





