October 17, 2024
SGSTV NEWS
Astrology

నేటి జాతకములు 13 సెప్టెంబర్, 2024



మేషం (13 సెప్టెంబర్, 2024)

మీకుటుంబ సభ్యులు కొద్దిమంది, తమ శత్రువులనిపించే ప్రవర్తనతో చిరాకు పుట్టిస్తారు,కానీ మీరు నిగ్రహం కోల్పోకూడదు. లేక పోతే పరిస్థితి అదుపు తప్పిపోతుంది. నివారణ లేనిదానిని, భరించక తప్పదు అని గుర్తుంచుకొండి. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీయొక్క ధనము జాగ్రత్త ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్ లను తెస్తుంది. చాలా విభేదాలు ఉన్నప్పటికీ ,ఈరోజు మీప్రేమజీవితం బాగుంటుంది.మీరు మీ ప్రియమైనవారిని కూడా సంతోషంగా ఉంచుతారు. కష్టపడి పని చెయ్యడం మరియు ఓర్పు వహించడం ద్వారా, మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఏదిఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి,కానీమీరు ఈరోజు సమయాన్ని వృధాచేస్తారు.దీనిఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. మీరు, మీ జీవిత భాగస్వామి ప్రేమలో, శారీరక బంధపు మధురిమలో మునిగి తేలేందుకు ఎంతో సమయం వెచ్చిస్తారు ఈ రోజు.

లక్కీ సంఖ్య: 2

వృషభం (13 సెప్టెంబర్, 2024)

అతి విచారం, వత్తిడి రక్తపోటుకి కారణం కావచ్చును. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోళ్ళు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీరుఅనుకున్నట్టు కుటుంబపరిస్థితి ఉండదు.ఈరోజు ఇంట్లో కలహాలు,గొడవలు ఏర్పడతాయి,ఈసమయంలో మిమ్ములను మీరు నియంత్రించుకోండి. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచంద్రతారార్కమూ ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇతరుల ఒత్తిడికి లోనుకాకండి. మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు, మొహమాటం, సిగ్గు పడకుండా తెలియచేయండి- ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు. ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా అందమైన దానితో సర్ ప్రైజ్ చేయడం ఖాయం.

లక్కీ సంఖ్య: 1

మిథునం (13 సెప్టెంబర్, 2024)

రిలాక్స్ అవడానికి మీ దగ్గరి స్నేహితులతో కొద్ది సేపు గడపండి. పాలవ్యాపారానికి చెందినవారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను,లాభాలను పొందుతారు. దూరప్రాంతంనుండి, అనుకోని వార్త, కుటుంబమంతటికీ ఉద్వేగాన్ని కలిగించేది రావచ్చును. ప్రేమ హద్దులకు అతీతం. దానికి పరిమితుల్లేవు. వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు. కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు. ఈ రోజు, చాలా చురుకుగాను, మీ అందరికీ చాలా చక్కని సోషల్ డే గా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానినే అంగీకరించి, శిరసా వహిస్తారు. మీరు ఖాళీసమయములో పుస్తకపఠనము చేస్తారు,అయినప్పటికీ మీరు మీకుంటుంబసభ్యులు మిమ్ములను తరచుగా మీకు భంగం కలిగిస్తారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తిస్థాయిలో జరగనుంది.

లక్కీ సంఖ్య: 8

కర్కాటకం (13 సెప్టెంబర్, 2024)

శారీరక విద్యను, మానసిక నైతిక విద్యలతో బాటుగా అభ్యసించండి. అప్పుడే సర్వతోముఖాభివృద్ది సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకొండి. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహి చగలదు. మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో- లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండడం అనేది, మిమ్మల్ని, మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి, అద్భుతమయిన మూడ్ ని రప్పించగలదు. ఒక రొమ్మన్స్ కి గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి- కానీ స్వల్పకాలికం మాత్రమే. ఆఫీసులో ఈ రోజు మీదే కానుంది! ఈరోజు,మీరు మి ప్రియమైనవారితో సమయాన్ని గడుపుతారు.మీభావాలను వారితో పంచుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు.

లక్కీ సంఖ్య: 3

సింహం (13 సెప్టెంబర్, 2024)

యతివంటి వ్యక్తినుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. మీరు సమయానికి,ధనానికి విలువఇవ్వవలసి ఉంటుంది,లేనిచో రానున్న రోజులలో మీరుసమస్యలు,పరీక్షలు ఎదురుకొనకతప్పదు. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగివంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. అనవసర సందేహాలు, అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి.ఈకారణముగా మీరు మి ప్రియమైన వారిపై సందేహపడొద్దు.కానీ ఏదైనా విషయము మిమ్ములను ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వారితో కూర్చుని మాట్లాడండి. మీ జీవితంలో ఈ రోజు జరిగే వాటికి మీరు తెర వెనుకనే మిగిలి పోయేలా ఉన్నది, ఫరవాలేదు, మంచి అవకాశాలు ముందుముందు మీతోనే ఉంటాయి. ఈరోజు, మీకుటుంబసభ్యులతో కూర్చుని మీరు జీవితంలోని ముఖ్యవిషయాలగురించి చర్చిస్తారు.ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బందిపెడతాయి.కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు. తప్పుడు సమాచారం ఈ రోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు. కానీ కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు.

లక్కీ సంఖ్య: 1

కన్య (13 సెప్టెంబర్, 2024)

ఒక స్నేహితుడు/రాలు మీ విశాలభావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్తపడండి. ఇంకా ప్రతి నిర్ణయంతీసుకునేటప్పుడు, సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. మీరు రోజులంతా ఆర్ధికసమస్యలు ఎదురుకున్నప్పటికీ,చివర్లో మీరులాభాలనుచూస్తారు. మీరంటే ఇష్టం, శ్రద్ధ ఉన్నవారిపట్ల సకారాత్మకంగా ఉండడానికి ప్రయత్నించండి. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్ఠను నాశనం చేస్తాయి. వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటివాటిని మర్చిపోండి. ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం! ఈరోజు మీకొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు , కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనులవలన మీయొక్క ప్రణాళికలు విఫలము చెందుతాయి. వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి. వాటిని మీరు ఈరోజు చవిచూడాల్సి రావచ్చు.

లక్కీ సంఖ్య: 9

తుల (13 సెప్టెంబర్, 2024)

మీ నిక్కచ్చితనం నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుని గాయపరచ వచ్చును. మీరు ఈరోజు మీ తోబుట్టువులనుండి సహాయసహకారాలు పొందుతారు. ఈ రోజు మీ చర్యలను చూసి, మీరు ఎవరితో ఉంటున్నారో, వారు, మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. మీప్రేయసిని మీరు వివాహముచేసుకోదలచిన ఈరోజు మీరు వారితో మాట్లాడండి.,అయినప్పటికీ వారు మీచేయిపట్టుకోవటం గురించి ఏమాలోచిస్తున్నారో తెలుసుకోండి. ఎవరైతే ఇంకాఉద్యోగమూరాకుండాఉన్నారోవారు ఈరోజు కష్టపడితేవారికి తప్పకుండా మంచి ఉద్యోగము వస్తుంది.కష్టపడితేనే మీకు ఫలితము ఉంటుంది. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. మీ జీవిత సర్వస్వమైన మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకో అద్భుతమైన సర్ ప్రైజ్ ఇవ్వవచ్చు.

లక్కీ సంఖ్య: 2

వృశ్చిక (13 సెప్టెంబర్, 2024)

మీఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరియైన సమాచారం అందక, నిరాశకు లోను కాగలరు. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ ని అప్ సెట్ చెయ్యవచ్చును. కార్యాలయ పరిసరాల్లో ప్రేమవ్యవహారాలు జరపకండి,ఎందుకంటే ఇది మీయొక్క పేరును చెడగొడుతుంది.మీరు ఎవరితోయినా మాట్లాడి వారికి దగ్గరవాలి అనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి. మీకు బాగా దగ్గరైనవారు మిమ్ములను వారితో సమయము గడపమని కోరతారు,కానీ సమయము చాలా విలువైనదికనుక మీరు వారి కోర్కెలను తీర్చలేరు.ఇది మిమ్ములను,వారిని కూడా విచారపరుస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు.

లక్కీ సంఖ్య: 4

ధనుస్సు (13 సెప్టెంబర్, 2024)

ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతుంటే- మీరు గుర్తుంచుకోవలసినదేమంటే, సరియైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే, అది ఈరోజునఎంతో హాయిని రిలీఫ్ ని ఇస్తుంది. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. మీరు ప్రేమించినవారితో వివాదాలకు దారితీసి వారిని అప్ సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా, దాటించెయ్యడం ఉత్తమం. రొమాన్స్- మీ మనసుని పరిపాలిస్తుంది. పగటికలలు మీకు పతనాన్ని తెస్తాయి- మీపనులను ఇతరులతో చేయించకండి. కుటుంబ అవసరాలు తీర్చేక్రమంలో,మీకొరకు మీరువిశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు.కానీ ఈరోజు మీరు మీకొరకు కొంత సమయాన్నికేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది.

లక్కీ సంఖ్య: 1

మకరం (13 సెప్టెంబర్, 2024)

మీ ప్రథమకోపం, మీకు మరింత సమస్యలోకి నెట్టేయగలదు. మీరు డబ్బులను పొదుపుచేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది.ఈరోజు మీరు ధనాన్ని పొదుపుచేయగలుగుతారు. తెలుసుకోవాలన్న జ్ఞానపిపాస మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. మీ చీకటినిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్లను కలిగించవచ్చును. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం, ప్రమాణ పూర్వకమైనది. జీవితం ఆనందంగా ఉండటానికి మీస్నేహితులతోకల్సి సమయాన్ని గడపాలి.లేనిచో మీరుఇబ్బందుల్లోఉన్నపుడు ఎవరు మిమ్ములను రక్షించడానికిరారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది.

లక్కీ సంఖ్య: 1

కుంభం (13 సెప్టెంబర్, 2024)

మీ శక్తిని అనవసర సాధ్యంకాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యర్థం చెయ్యకండి. దానికి బదులు ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని వినియోగించండి. మీరు ఈరోజు మీ తోబుట్టువులనుండి సహాయసహకారాలు పొందుతారు. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురిఅవుతారు. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి, కుతూహలాన్ని కలిగించేలాగ- మీ స్టైలు, అసమానరీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను, మెరుగు పరచుకోవడానికి క్రొత్త చిట్కాలు/ టెక్నిక్ లను అవలంబించండి. ఈరాశికి చెందినపెద్దవారు వారి ఖాళీసమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు. కానీ తన ఆరోగ్యమే పాడు కావచ్చు.

లక్కీ సంఖ్య: 8

మీన (13 సెప్టెంబర్, 2024)

మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే, మరీ అతి సంతోషంకూడా సమస్యలకు దారితీయవచ్చును. మీరు సానుకూల దృక్పధంతో ఇంటినుండి బయటకు వెళతారు.కానీ మీయొక్క అతిముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వలన మీయొక్క మూడ్ మొత్తంమారిపోతుంది. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే, మీసన్నిహిత స్నేహితులని ఆహ్వానించండి.- అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. మీరు రొమాంటిక్ ఆలోచనలలోను, గతం గురించిన కలలలోను మునిగి పోబోతున్నారు. శక్తివంతమయిన పొజిశన్ లో ఉంటారు. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు.

లక్కీ సంఖ్య: 5

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Also read

Related posts

Share via