January 28, 2025
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

YSRCP: ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం.. జగన్ తో ఓటమి పాలైన నేతలు



‘ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోయాం’ అని ఎన్నికల్లో ఓటమిపాలయిన పలువురు వైకాపా అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. కార్యకర్తలకు అండగా నిలవాలన్న వైకాపా అధ్యక్షుడు 

అమరావతి: ‘ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోయాం’ అని ఎన్నికల్లో ఓటమిపాలయిన పలువురు వైకాపా అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. సోమవారం తాడేపల్లిలో జగన్ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి మాట్లాడారు. ‘ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే గడప గడపకు తిరిగినప్పుడో, ఎన్నికల ప్రచార సమయంలోనైనా ఎంతో కొంత బయటపడి ఉండాలి కదా! ఎక్కడా ఆ పరిస్థితి ఎదురవలేదు. వ్యతిరేకత అంతా పోలింగ్ రోజే కనిపించడం ఊహించలేకపోయాం. జనం పల్స్ పట్టుకోలేకపోయామా అనిపించింది. రాయలసీమ ప్రాంతంలో ఎన్నికలను ప్రభావితం చేసే రెడ్డి సామాజికవర్గం ఫ్యాక్టర్ కూడా పని చేయలేదు. పూర్తిగా పార్టీ గ్రామాలనుకునే చోట కూడా ఓట్లు పడలేదు. 2019లో అయితే అప్పటి తెదేపా ప్రభుత్వంపై జనంలో ఉన్న వ్యతిరేకత బహిరంగంగా కనిపించింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి

మాత్రమే పూర్తి వ్యతిరేకత ఉంది, మిగిలిన వర్గాల నుంచి వ్యతిరేకత కనిపించలేదు. సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందాయి కాబట్టి పాజిటివ్గా ఉందనే భావించాం. కానీ, రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన ప్రతికూల ఫలితాలను ఎదుర్కొన్నాం’ అని ఆ నేతలు జగన్కు చెప్పారు. ‘మీరు స్ట్రాంగ్గా ఉండండి.. ఓపికగా ఉండండి.. కార్యకర్తలు అండగా నిలవండి, వారిని జాగ్రత్తగా చూసుకోండి’ అని జగన్ నేతలకు సూచించారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ విక్రాంత్, ఓడిపోయిన నేతలు బొత్స సత్యనారాయణ, రెడ్డప్ప, తలారి రంగయ్య, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, శంకర నారాయణ, సంజీవయ్య, పుష్ప శ్రీవాణి, ఉమాబాల, బుట్టా రేణుక, రెడ్డి శాంతి, చిర్ల జగ్గిరెడ్డి, కళావతి, సత్యవతి, గొడ్డేటి మాధవి తదితరులు జగన్ను కలిసిన వారిలో ఉన్నారు.

Also read

Related posts

Share via