హోం ఓటింగ్ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు.
ముప్పాళ్ల: హోం ఓటింగ్ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. 85 ఏళ్లు నిండిన వృద్ధుల కోసం గ్రామంలో ఎన్నికల అధికారులు హోం ఓటింగ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి పోలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైకాపాకి చెందిన వారు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో తెదేపాకు చెందిన కానాల పుల్లారెడ్డి, రావిపాటి నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను తొలుత సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను సత్తెనపల్లి తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఆయన సూచన మేరకు కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025