SGSTV NEWS online
Andhra PradeshCrimeViral

జన సేన ఎమ్మెల్యే
రాసలీలల వీడియో లీక్.. పవన్ కు ట్యాగ్ చేస్తూ వైసీపీ సంచలన ట్వీట్..



Janasena MLA: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే  విప్ అరవ శ్రీధర్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యేకు సంబంధించిన కొన్ని వీడియో కాల్ దృశ్యాలు, వాట్సాప్ చాట్లను వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టించింది.



ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగినిని ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే.. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని తెలుస్తోంది. సదరు మహిళకు అప్పటికే వివాహమై మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే.. ఆమెను భయపెట్టి అక్రమ సంబంధం కొనసాగించారని వైసీపీ పేర్కొంది. ఒకానొక దశలో ఆ మహిళ గర్భం దాల్చగా.. ఎమ్మెల్యే ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించారని కూడా ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యవహారంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే.. సదరు మహిళ తన కోరిక తీర్చకపోతే ఆమె మూడేళ్ల కొడుకును చంపేస్తానని శ్రీధర్ బెదిరించినట్లు ఆరోపిస్తోంది. అలాగే.. బాధితురాలి భర్తకు కూడా ఫోన్ చేసి ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడ్డారని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం బాధితురాలి భర్తకు తెలియడంతోనే బయటపడిందని సమాచారం.

ఈ వ్యవహారంపై స్పందించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత, లోకేశ్లను ట్యాగ్ చేస్తూ వైసీపీ పోస్టులు పెట్టింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, మహిళలను రక్షించాల్సిన ఎమ్మెల్యే ఇలాంటి చర్యలకు పాల్పడటంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

Also read

Related posts