SGSTV NEWS
Andhra PradeshCrime

ysr news: డిగ్రీ చదివి.. జల్సాలకు అలవాటుపడి చోరీలు..


డిగ్రీ చదివిన ఓ యువకుడు జల్సాలకు అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం అడ్డదారులు తొక్కాడు.

కడప : డిగ్రీ చదివిన ఓ యువకుడు జల్సాలకు అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం అడ్డదారులు తొక్కాడు. ఇప్పటిదాకా 14 చోరీలకు పాల్పడి.. పలుమార్లు జైలుకు వెళ్లొచ్చాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. మళ్లీ చోరీకి పాల్పడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ యువకుడి వివరాలను డీఎస్పీ రమాకాంత్ మీడియాకు వెల్లడించారు.

వైఎస్సార్ జిల్లా మోచంపేటకు చెందిన షేక్ అక్బర్ అలీ ఖాన్ అనే యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. ప్రైవేటుగా ఎలక్ట్రిషన్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. జల్సాలకు అలవాటుపడ్డాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో చోరీలు చేయడం మొదలుపెట్టాడు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా ఎంచుకొని దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. కడప నగరంలో  దాదాపు 14 దొంగతనాలు చేశాడు. పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఈనెల 5వ తేదీన కడప ఎన్జీవో కాలనీలో ఓ ఇంట్లోకి వెళ్లి చోరీకి పాల్పడ్డాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. షేక్ అక్బర్ అలీని అరెస్టు చేసి అతని నుంచి రూ.6లక్షల విలువ చేసే 135 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.

Also read

Related posts