July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

45వ డివిజన్లో కోట్లాది రూపాయల భూ కబ్జాతో వైసీపీ కార్యాలయం నిర్మాణం చేసి పాలకులు దోచుకున్నారు….

ప్రజలకు ఉపయోగపడే పట్టాభి స్మారక భవనాన్ని వైసీపీ పాలకులు అడ్డుకున్నారు…..

45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, పి. వి. ఫణి కుమార్ నివాసంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో డివిజన్ ఇంచార్జ్, పి. వి. ఫణి కుమార్, డివిజన్ నాయకులు, పామర్తి నరేష్, గంజాల రవికుమార్, కొనకళ్ళ భాను లు నిర్వహించిన పాత్రికేయుల సమావేశం వివరాలు….

మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45 వ డివిజన్లో జిల్లా కోర్టుకు వెళ్లే రోడ్డు ప్రక్కన కోట్లాది రూపాయల స్థలమును కబ్జా చేస్తూ వైసీపీ కార్యాలయం నిర్మించారు.

ఎంపీ వల్లభనేని బాలశౌరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో స్థలం కేటాయించి స్వాతంత్ర సమరయోధుడి పేరిట పట్టాభి స్మారక భవన నిర్మాణం చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా వివిధ రకాలైన శిక్షణలు ఇప్పిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేద్దామని ఎంపీ బాలశౌరి ప్రయత్నించిన వైసీపీ పాలకులు ఎంతో అడ్డుపడ్డారు అని మండిపడ్డారు.

క్రీడాకారులకు చాలీచాలని విధంగా స్టేడియం నిర్మాణం పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు అన్నారు.

బస్టాండ్ పక్కన వేసిన రోడ్డు డ్రైనేజీ పూడ్చివేసి కల్వర్టర్ వేయకుండా రోడ్డుమీద రోడ్డు వేసి ఆ వేసిన రోడ్డు కూడా సగం వేసి ఈడేపల్లి ఆంజనేయస్వామి గుడి వరకు వెయ్యకుండా పాలకులు అవినీతికి పాల్పడ్డారు అన్నారు.

డివిజన్లో డ్రైనేజీ నిర్మాణం అంటూ మురుగునీరు వెళ్లకుండా అక్రమాలకు పాల్పడుతూ మామ అనిపించారు అన్నారు.

ఎక్కడో మునిగిపోయే చోట ప్రజలకు ఇళ్ల స్థలాల పేరుతో సెంటు పట్టా అంటూ ప్రజలను మభ్యపెట్టారు, వైసీపీ కార్యాలయం కట్టిన మచిలీపట్నం నడిబొడ్డున వైసీపీ కార్యాలయం కాకుండా ఆ స్థలంలో ప్రజలకు ఇళ్లపట్టాలిస్తే ఎంతో బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారు అన్నారు.

గడిచిన ఈ ఐదు సంవత్సరాల వైసిపి పరిపాలనలో 45 వ డివిజన్లో పాలకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కొల్లు రవీంద్ర, వల్లభనేని బాలసౌరి లు గెలవంగానే ఆక్రమాలను బయటపెడతామన్నారు.

డివిజన్ ప్రజలు పాలకుల అక్రమాలను గుర్తించి, వచ్చే ఎన్నికలలో ప్రజల కోసం పనిచేసే ఎన్డీఏ కూటమి
ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి ఎన్నికల గుర్తు గ్లాస్ కు, మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, కొల్లు రవీంద్ర ఎన్నికల గుర్తు సైకిల్ కు ఓటు వేసి డివిజన్ ప్రజలు వారి ఇరువురిని ఆశీర్వదించాలని 45వ డివిజన్ ప్రజలను కోరారు.

Also read

Related posts

Share via