పరిగి (శ్రీసత్యసాయిజిల్లా) : ఆన్‌లైన్ బెట్టింగ్‌కు యువకుడు బలయ్యాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… పరిగి మండలం పైడేటి గ్రామానికి చెందిన జయచంద్ర (24) డిగ్రీ పూర్తి చేశాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన ఆయన తాను చేస్తున్న పాల వ్యాపారం, ఇటుక బట్టి నిర్వహణ ద్వారా వస్తున్న డబ్బులను సైతం బెట్టింగ్ కాసి నష్టపోయాడు. దాదాపు రూ.1.50 లక్షల అప్పులు కూడా చేశాడు. ఈ విషయం తెలిసిన జయచంద్ర తండ్రి ఆదినారాయణ అప్పులను తాను తీర్చేస్తానని, ఇకపై బెట్టింగ్‌ల జోలికి వెళ్లవద్దని, బెంగళూరులో ఉద్యోగం చేసుకోవాలని చెప్పారు. బెంగళూరుకు వెళ్తున్నట్టు జయచంద్ర చెప్పి ఈ నెల 17న ఇంటి నుంచి బయలుదేరాడు. శనివారం రాత్రి హిందూపురం గుడ్డం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జయచంద్ర తన టీ షర్ట్‌పై ‘ఆన్‌లైన్ బెట్టింగ్ జోలికి వెళ్లకండి.. జీవితం నాశనం చేసుకోకండి’ అంటూ పెన్నుతో రాసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Also read
- Diwali 2025: దీపావళి రోజున పాత ప్రమిదల్లో దీపాలు వెలిగించడం శుభమా? అశుభమా? నియమాలు తెలుసుకోండి..
- Astro Tips: ఈ రాశుల వారు వెండి ధరించారో బతుకు బస్టాండే.. తస్మాత్ జాగ్రత్త
- నేటి జాతకములు…16 అక్టోబర్, 2025
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత