April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

ప్రేమించాడు.. పెళ్లి అన్నాడు.. ఆపై తిరస్కరించాడు..?

• యువతి ప్రేమ ఖరీదు రూ. 9లక్షలుగా వెల కట్టిన పెద్ద మనుషులు

జ్యోతినగర్(రామగుండం): యువతీ, యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని బాసలు చేసుకున్నారు. అంతలోనే మనస్పర్థలు రావడంతో వారి ప్రేమకు పెద్ద మనుషులు వెలకట్టిన ఉదంతం ఎన్టీపీసీ రామగుండం ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎన్టీపీసీ రామగుండం పోలీస్టేషన్ పరిధిలో నివాసముండే ఓ యువతి, యువకుడు కులాలు వేరైనప్పటికీ మనసులు కలిసి ప్రేమించుకున్నారు.

మూడేళ్లుగా తమ ప్రేమను పంచుకుని పెళ్లి చేసుకుందామని ఓ నిర్ణయానికి వచ్చారు. ఇంతలోనే వారి మధ్యలో కొంత మనస్పర్థలు రావడంతో యువతిని పెళ్లి చేసుకునేందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో బాధితురాలు యువకుడి ఇంటి ఎదుట నిరసన సైతం చేపట్టింది. ఇరువురి విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.

ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ వారిద్దరి పెళ్లి జరుగకపోగా వారి ప్రేమను విడగొట్టడానికి కొంతమంది పెద్దలు రూ.9 లక్షలుగా నిర్ధారించినట్లు తెలిసింది. ప్రేమకు వెలకట్టిన క్రమంలో రూ.4లక్షలు సైతం యువతి బంధువులకు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పెళ్లి చేసుకోవాలని యువకుడిని యువతి వేడుకున్నా.. యువకుడిది ఉన్నత కుటుంబం కావడంతో ఎట్టకేలకు యువతి ప్రేమకు వెలకట్టారు.



Also read

Related posts

Share via