వైసీపీ పెద్దలు, ఓ ఐపీఎస్ అధికారి సూచన మేరకే తనకు గన్మెన్లను కేటాయించారని రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.
పట్టాభిపురం, : వైసీపీ పెద్దలు, ఓ ఐపీఎస్ అధికారి సూచన మేరకే తనకు గన్ మాన్ ను కేటాయించారని రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బోరుగడ్డ పేట్రేగిపోయాడు. ఏఐఎల్సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబూ ప్రకాష్ ను డబ్బు కోసం బెదిరించిన కేసులో ఇటీవల అతడిని అరెస్టుచేసిన విషయం తెలిసిందే. పోలీసుల విజ్ఞప్తి మేరకు నిందితుడిని మూడు రోజులు విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. శనివారం వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం మధ్యవర్తుల సమక్షంలో మాత్రమే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి అరండల్పేట పోలీసులు మధ్యవర్తుల సమక్షంలో బోరుగడ్డను విచారించడం ప్రారంభించారు. బాబూ ప్రకాష్ ను ఎందుకు బెదిరించాల్సి వచ్చింది? ఎంత డబ్బు డిమాండ్ చేశారు? ఏమని బెదిరించారు? ఎంత డిమాండ్ చేస్తే ఆయన ఎంత డబ్బు ముట్టజెప్పారని పోలీసులు బోరుగడ్డను ప్రశ్నించారు. వైసీపీ నేతలు పెద్ద పదవి ఇస్తామని ఆశ చూపారని అందులో భాగంగానే బెదిరింపులు, దందాలకు పాల్పడ్డానని బోరుగడ్డ వెల్లడించాడు. వైసీపీ నేతల పెద్దల ప్రమేయంతో పాటు ఐపీఎస్ అధికారి ఆదేశాల మేరకు గన్మెన్ ను సైతం కేటాయించినట్లు విచారణలో వెళ్లగక్కాడు.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..