అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ జడ్పీటీసీ సభ్యురాలు రమాదేవి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు,రాడ్లతో దాడి చేశారు. అన్నమయ్య జిల్లా అక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామ పరిధిలోని జాండ్రపల్లెలో ఈ ఘటన జరిగింది.
Annamayya District : అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ జడ్పీటీసీ సభ్యురాలు రమాదేవి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. అన్నమయ్య జిల్లా అక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామ పరిధిలోని జాండ్రపల్లెలో ఆదివారం రాత్రి జడ్పీటీసీ రమాదేవి, మాజీ ఎంపీపీ రెడ్డయ్య దంపతుల ఇంటిపై దాడిచేసిన నిందితులు వీరంగం సృష్టించారు. కాగా దాడికి ముందు మంత్రి రాంప్రసాద్ రెడ్డి లక్కిరెడ్డి పల్లి టీడీపీ నేత మదన్ మోహన్ సెల్ నుంచి వాట్సాప్ కాల్ చేసి నిన్ను చంపేస్తాం అని బెదిరించాడని రెడ్డయ్య తెలిపారు. ఆయనే తమ ఇంటిపై దాడి చేయించాడని వారు ఆరోపిస్తున్నారు.
సుమారు 60 మందికిపైగా దుండగులు మంకీ క్యాప్ లు ధరించి ఇంటిపై దాడిచేసి ఒక బుల్లెట్ వాహనానికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. మరో బుల్లెట్ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇంటి సామాగ్రి ధ్వంసం చేశారు. గర్భవతి అని కూడా చూడకుండా జడ్పీటీసి కోడలు పై విచక్షణారహితంగా దాడి చేశారు.
భర్త రెడ్డయ్యతో పాటు కొడుకు రమేష్‌ను కాపాడుకునేందుకు ఇంటి వెనుక డోర్ నుంచి పంపించేందుకు రమాదేవి ప్రయత్నించగా ఆడవాళ్లు అని చూడకుండ తమపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. తమ కోడలు ఆరునెలల గర్బవతిగా ఉందని ఆమె జోలికి వెళ్లద్దు అని ప్రాథేయపడిన వినకుండా దాడి చేశారని రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ర్టంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని, ఆడవాళ్లు , మగవాళ్లు అని తేడా లేకుండా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దాడి చేసింది ముమ్మాటికి టీడీపీ కార్యకర్తలేనని ,వారంతా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులని ఆమె ఆరోపించారు. కాగా ఇంటిపై దాడిచేసి ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయడంతో పాటు తమపై దాడిచేసిన టీడీపీ మూకలపై చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ రమాదేవి కోరారు.
కాగా జడ్పీటీసీ ఇంటిపై దాడి చేయడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఒక మహిళా ప్రజాప్రతినిధికే రాష్ట్రంలో రక్షణ లేకుంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.
Also read
- Andhra News: ఆపినా ఆగకుండా దూసుకెళ్లిన కారు.. చేజింగ్ చేసి తనిఖీ చేయగా..
- Andhra Pradesh: కూతురు పెళ్లికి సహకరించిన వ్యక్తిపై పగపెంచుకున్న ఓ తండ్రి.. ఏం చేశాడో తెలుసా..?
- అప్పా, అమ్మా నన్ను క్షమించండి.. మీ పావన
- Guntur: సైకో మంజు టార్గెట్ చేస్తే మిస్ అవ్వదు.. జైలుకు వెళ్ళొచ్చినా మారని బుద్ధి..!
- Andhra Pradesh: వీళ్లేం మనుషులురా బాబు .. మతిస్థిమితం లేని మహిళను గెంటేయడమే కాకుండా..!