April 18, 2025
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Crime

Pinnelli: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం..!



మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. న్యాయస్థానం ఇచ్చిన గడువు గురువారంతో ముగియనుండటంతో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం ఈవీఎంల ధ్వంసం కేసుతో సహా మూడు హత్యాయత్నం కేసులు పిన్నెల్లిపై నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్టును తప్పించుకునేందుకు పిన్నెల్లి.. న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అరెస్టుకు భయపడిన పిన్నెల్లి సోదరులు గతంలో పోలీసులు కళ్లు గప్పి పారిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎస్పీ ఆదేశాలతో ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మఫ్టీలో పహారా కాస్తున్నారు.

Also read

Related posts

Share via