SGSTV NEWS
Andhra PradeshCrime

వైసీపీ కౌన్సిలర్ ఇంట్లో రేషన్ బియ్యం స్వాధీనం



కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని గాంధీనగర్లో పదో వార్డు వైసీపీ కౌన్సిలర్ మొగలి దుర్గానందరావు ఇంటి ముందున్న షెడ్డులో.. 35 సంచుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 17.49 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసు, పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.

గొల్లప్రోలు,: కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని గాంధీనగర్ లో పదో వార్డు వైసీపీ కౌన్సిలర్ మొగలి దుర్గానందరావు ఇంటి ముందున్న షెడ్డులో.. 35 సంచుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 17.49 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసు, పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. గొల్లప్రోలుకు చెందిన సిరిపిరెడ్డి వీరభద్రరావు ఆ బియ్యాన్ని స్థానికుల నుంచి సేకరించారు. ఉప తహసీల్దారు భారతి ఫిర్యాదుతో బాధ్యులైన దుర్గానందరావు, వీరభద్రరావులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఈ బియ్యాన్ని పిఠాపురంలోని గోదాముకు తరలించినట్లు ఆస్ఐ బాలకృష్ణ పేర్కొన్నారు.

Also read

Related posts